తనకి టీ ఇవ్వలేదనే కోపంతో మత్తు ఇచ్చిన పేషెంట్లకు సర్జరీ చేయకుండానే బయటకు వెళ్లిపోయాడు ఓ డాక్టర్. ఈ ఘటన మహారాష్ట్రలని నాగ్‌పూర్ జిల్లాలో జరిగింది. ఖట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడానికి నలుగురు మహిళలు వచ్చారు.
వారికి ఆపరేషన్ చేసేది డాక్టర్ తేజ్‌రామ్ భలవి. ఆయన ఆ మహిళలకు ఆపరేషన్ చేసే ముందు ఆయనకు టీ కావాలని ఆసుపత్రి సిబ్బందిని టీ కావాలని అడిగారు. కానీ ఎవరూ కూడా ఆయన మాటను పట్టించుకోలేదు. అంతే కాకుండా టీ కూడా ఇవ్వలేదు. ఆ కోపంతోనే థియేటర్ లోపలికి వెళ్లిన తేజ్ రామ్ మహిళలకి ఎవరికి కూడా ఆపరేషన్ చేయకుండ బయటకు వచ్చేశారు.
Also read: అంబులెన్స్ లేక కూరగాయల బండి పై ఆసుపత్రికి..సిగ్గుచేటంటున్న ప్రతిపక్షాలు!
దీంతో ఆపరేషన్ కోసం మత్తు ఇచ్చిన నలుగురు మహిళలు కూడా అలాగే ఆపరేషన్ బెడ్ల మీద ఉండిపోయారు. టీ ఇవ్వకపోవడం వల్లే డాక్టర్ ఆపరేషన్లు చేయకుండా వెళ్లిపోయాడని తెలుసుకున్న జిల్లా యంత్రాంగం మరో వైద్యుని ఏర్పాటు చేసింది. ఆపరేషన్లను మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన తేజ్ రామ్ పై విచారణ జరపాలని ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ విషయం గురించి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు కుందా రౌత్ స్పందించారు. కేవలం ఒక టీ కోసం ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వెళ్లిన వైద్యుని మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. డాక్టర్ వల్ల ఆ నలుగురు మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అలానే డాక్టర్ తేజ్‌రామ్ భలవిపై ఐపీసీ 304 సెక్షన్ కింద ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.