Health Tips : రోజూ కనీసం 6 గంటలు కూర్చునే పనిచేస్తారా? అయితే.. మీరు డేంజర్ లో ఉన్నట్లే..!! రోజుకు 6 గంటలు కూర్చుని పనిచేస్తే మీ డేంజర్ జోన్ లో ఉన్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శారీరక శ్రమ లేకుంటే అనేక అనారోగ్య సమస్యలకు ఆహ్వానం పలికినట్లే. గుండెజబ్బులు, ఉబకాయం, మానసిక ఆరోగ్యం, చెడు కొలెస్ట్రాల్ ఎన్నో వ్యాధుల బారిన పడటం ఖాయమంటున్నారు. By Bhoomi 15 Nov 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నేటికాలంలో డెస్క్ ఉద్యోగాలు చేసేవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కంప్యూటర్, లాప్ ట్యాప్ ల ముందే గంటలకొద్దీ సమయాన్ని గడుపుతున్నారు. ఆఫీస్ పని పూర్తయిన తర్వాత కూడా టీవీ, ఫోన్లు చూస్తూ గడిపేస్తున్నారు. ఫలితంగా చాలామంది ఇంట్లోనే ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కాలం వెల్లదీస్తున్నారు. ఇంట్లో ఉండేవారు కూడా బద్దకం కారణంగా సోఫాలకు బెడ్స్ కు అతుక్కుపోతున్నారు. రోజూ పగటిపూట 6గంటలు, అంతకంటే ఎక్కువ సమయం కూర్చునే ఉండటం లేదంటే పడుకోవడం, శారీరకంగా శ్రమలేనివారు నిశ్చల జీవనశైలి ఫాలో అవుతున్నట్లని నిపుణులు అంటున్నారు. శారీరక శ్రమ లేనట్లయితే అనేక రకాల రోగాలకు ఆహ్వానం పలికినట్లేనని చెబుతున్నారు. దీనివల్ల తెలియకుండానే మన శరీరం బద్దకానికి అలవాటు పడుతుంది. నిశ్చల జీవనశైలి కారణంగా రోగాల ముప్పు పెరుగుతుంది. దీని ఎఫెక్ట్ మానసిక ఆరోగ్యంపై కూడా పడుతుంది. ఇలాంటి లైఫ్ స్టైల్ ఉన్నవారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. గుండె జబ్బులు ముప్పు తప్పదు: శరీరానికి కావాల్సినంత శ్రమ లేకపోవడం, గుండె జబ్బుల ముప్పును పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిశ్చల జీవనశైలి కారణంగా కార్డియోమయోపతి సమస్య వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. కార్డియోమయోపతి వల్ల గుండెకు ఆక్సిజన్ రిచ్ బ్లడ్ పంపింగ్ తగ్గిపోతుంది. శారరీక శ్రమ లేకపోవడం వల్ల కొవ్వు,చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని మరింత తీవ్రం చేస్తుంది. ఉబకాయం: శారీరక శ్రమ లేకుంటే శరీరంల కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. ఫలితంగా ఊబకాయం ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. పెద్దలు, యువత, వారానికి కనీసం రెండున్నర గంటల శారీరక శ్రమలో పాల్గొనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిశ్చల జీవనశైలి కారణంగా అధిక బరువు, ఊబకాయానికి దారితీస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది: వ్యాయాయం చేస్తుంటే మెదడు సెరోటినిన్ అంటే న్యూరోట్రాన్స్మిటర్లను రిలీజ్ చేస్తుంది. సెరోటోనిన్ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచుతుంది. ఒత్తిడికి దూరంగా ఉంచుతుంది. శారీరక శ్రమ లేనివారిలో సెరోటోనిన్ విడుదల తక్కువగా ఉంటుంది. ఫలితంగా మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది: శరీరానికి కావాల్సినంత శ్రమ కల్పించనట్లయితే..కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే..ధమనులల్లో పేరుకుపోతుంది. ఫలకం ఏర్పడి..రక్త నాళాలు సంకుచితం అవుతాయి. ఈ సంకుచితం రక్త ప్రవాహాన్ని పరిమితం చేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పు ఎక్కువగా ఉంటుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లయితే..గుండె సమస్యలు, స్ట్రోక్, హార్ట్ ఎటాక్, వంటి తీవ్రమైన ముప్పు పెరుగుతుంది. టైప్-2 డయాబెటిస్: శారీరకంగా యాక్టివ్‌గా లేకపోతే.. శరీరం ఇన్సులిన్‌కు తక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దీంతో టైప్2 డయాబెటిస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలతోపాటు పెద్దలూ రోజూ అరగంటైనా వ్యాయామం, శారీరక శ్రమ, యోగా చేయడం తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి : నడవడానికే వస్తలేదు ఇంకేం గెలుస్తడు…పోచారంపై…ఏనుగు సెటైర్లు.!! #health-tips #health #lifestyle #6hours-sitting మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి