Tollywood Actors : మన సినీ స్టార్స్ సినిమాలు, ఇతర బిజినెస్ ల రూపంలో ఏడాదికి కొన్ని కోట్లు సంపాదిస్తుంటారు. దానికి తగ్గట్లే గవర్నమెంట్ కు ట్యాక్స్ లు కడతారు. తాజాగా ఫార్చూన్ ఇండియా సంస్థ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక ట్యాక్స్ కట్టిన సెలబ్రిటీల లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో షారుఖ్ ఖాన్ అత్యధికంగా 92 కోట్ల ట్యాక్స్ కట్టి టాప్ ప్లేస్ లో ఉన్నాడు.
అయితే ఈ లిస్ట్ లో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క హీరో ఉండటం గమనార్హం. అతను మరెవరో కాదు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 2023-24 ఆర్ధిక సంవత్సరానికి గానూ బాణీ ఏకంగా రూ. 14 కోట్లు ట్యాక్స్ కట్టి టాలీవుడ్ లో అత్యధికంగా ట్యాక్స్ కట్టిన స్టార్ గా నిలిచాడు. దీంతో ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ జనాలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
Also Read : మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది
కేవలం ట్యాక్సే ఇన్ని కోట్లు కడుతున్నాడంటే బన్నీ ఏడాదికి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో అని నెటిజన్స్ అంతా ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. సినిమాల్లో రెమ్యునరేషన్స్ తో పాటు యాడ్స్, థియేటర్స్, పలు బిజినెస్ లతో అల్లు అర్జున్ బాగానే సంపాదిస్తున్నాడు. అందుకే ఈ రేంజ్ లో ట్యాక్స్ కట్టాడు. కాగా కోలీవుడ్ నుంచి చూసుకుంటే దళపతి విజయ్ ఈ ఏడాది ఏకంగా రూ.80 కోట్లు ట్యాక్స్ కట్టడం విశేషం.