Health Tips: చలికాలంలో రోజూ బెల్లం టీ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా..?

వాతావరణం మారినప్పుడు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ప్రస్తుతం చలికాలంలో రోగాలు రాకుండా ఆహారంలో చాలా జాగ్రత్తలు అవసరం. రోగనిరోధక శక్తిని పెంచి.. మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లంటీ అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని రోజూ ఉదయం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.

New Update
Health Tips: చలికాలంలో రోజూ బెల్లం టీ తాగితే ఎన్నో ప్రయోజనాలో తెలుసా..?

drinking jaggery tea daily benefits: ప్రస్తుతం ఏ వ్యాధి లక్షణాలు ఉన్నా అనారోగ్యాల బారినపడకుండా ఉండేందుకు ఎన్నో సూచనలు, సలహాలు నిపుణులు ఇస్తున్నారు.  చాలామందికి ఉదయం టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇక చలికాలంలో పొద్దున్నే కాదు రోజూలో 4 నుంచి5 సార్ల అయిన వేడిగా తాగాలని ఉంటుంది. చలికాలంలో రోగాలు వ్యాప్తించే అవకాశాలు ఎక్కువ. శరీరంలో రోగ నిరోధకశక్తి తగ్గి బ్యాక్టీరియా ఎటాక్ చేస్తుంది. అందుకే చలికాలంలో రోగ నిరోధకశక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా చలికాలంలో సూర్యుని వేడి తక్కువగా ఉంటుంది. అందుకే భోజనం త్వరగా చేస్తే మంచిది. చలికాలంలో చాలామంది వ్యాయామాలు చేయడానికి ఆసక్తి చూపరు. దీని వలన ఫిట్‌నెస్ కోల్పోతారు. ఈ టైంలో బెల్లం టీ తాగితే.. వెయిట్‌లాస్ అవ్వడంతో పాటు కొన్ని దీర్ఘకాలిక సమస్యలకు దూరం అవుతాయిని నిపుణులు చెబుతున్నారు. మరి బెల్లం-టీని ఎలా తాగాలి, ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రోజూ ఇలా చేస్తే ఎంతో ఉపయోగం:

  • టీ ప్రియులు చలికాలంలో బెల్లం టీని తాగితే బెస్ట్‌. బెల్లం టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జీర్ణక్రియ సమస్యలను దూరం చేస్తుంది. జీర్ణక్రియ పెరిగి గ్యాస్, మల బద్ధకం, అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది.
  • చాలా మంది బరువుతో ఇబ్బంది పడుతారు. ఆ బరువు తగ్గాటానికి ఎన్నో ఆహారాలను తీసుకుంటారు. కొవ్వును కరిగించడంలో బెల్లం టీ బాగా పనిచేస్తోంది.
  • చలికాలంలో ప్రతీరోజూ బెల్లంతో తయారు చేసిన ఆహారాలు తింటే శరీరంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా పెరుగుతుంది. దీంతో శరీరంలో బలంగా ఉంటుంది.
  • మహిళలకు పీరియడ్స్‌లో వచ్చే నొప్పిని తగ్గించడంలో బెల్లంటీ అద్భుతం. బెల్లంటీని తాగితే శరీరానికి పోషకాలతో పాటు నెలసరి నొప్పులను తగ్గిస్తుంది.
  • బెల్లంలో కాల్షియం, విటమిన్ బి, పొటాషియం, ఐరన్‌తో పాటు ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. చలికాలంలోరోజూ ఉదయాన్నే బెల్లం టీని తాగితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతోంది.
  • శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి బెల్లం టీ సహాయపడుతుంది. రెగ్యులర్‌గా బెల్లం టీ తాగితే ఊపిరితిత్తులు, పొట్ట, పేగులు శుభ్రపడతాయి.
    మలబద్దకం సమస్యను పోగొట్టటంలో బెల్లం టీ బాగా పనిచేస్తుంది.

ఇది కూడా చదవండి: పరగడుపున ఈ జ్యూస్‌ను తాగితే ఏమవుతుందో తెలుసా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు