Healthy Diet : నేటి కాలంలో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటిన్నింటికి కారణం జీవనశైలి. మారుతున్న ఆహారపు అలవాట్లు. మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే మనం అనారోగ్యం బారినపడకుండా ఉండవచ్చు. అయితే చాలా మంది డ్రైఫ్రూట్స్, పండ్లు, తాజాకూరగాయలు తింటుంటారు. వీటితోపాటు ప్రతిరోజూ పిడికెడు వేరుశెనగలు కూడా తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.
చాలా మందికి వేడి వేడిగా కాచిన వేరుశనగలంటే చాలా ఇష్టం. కాలక్షేపం కోసం చిరువ్యాపారుల నుంచి కొనుగోలు చేసి తింటుంటారు. అంతేకాదు వంటకాల్లోనూ వేరుశెనగ నూనెను వాడుతుంటారు. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకున్నట్లయితే తిన్న ఆహారాన్ని సులువుగా జీర్ణం చేస్తుంది. వేరుశెనగ సహజంగా అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో జోడించుకోవడం వల్ల రోగనిరోధకశక్తిని పెంచుతుంది. మీ రోజువారీ ఆహారంలో వేరుశెనగను చేర్చుకోవడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి : రక్షా బంధన్ శుభ సమయం, రాఖీ ఎప్పుడు కట్టాలి, ప్రాముఖ్యత, చరిత్ర..!!
వేరుశెనగలో పోషకాలు:
వేరుశెనగల్లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, B విటమిన్లు, విటమిన్ E, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలతో సహా అవసరమైన పోషకాలకు వేరుశెనగలు మంచి మూలం.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి:
వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అవి గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులు. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వేరుశెనగలో రెస్వెరాట్రాల్ వంటి అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
బరువు తగ్గడంలో:
వేరుశెనగలో కేలరీలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిలోని ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ సంతృప్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. ఇలా చేయడం వల్ల మీ పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉంటుంది. మీ ఆహారంలో వేరుశెనగలను జోడించడం వల్ల మొత్తం క్యాలరీలను తగ్గించడం ద్వారా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
షుగర్ కంట్రోల్:
వేరుశెనగలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వుల కలయిక రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత గ్లూకోజ్ వేగంగా పెరగడాన్ని నివారిస్తుంది. మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి వేరు శెనగలను డైట్లో చేర్చుకుంటే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది:
వేరుశనగల్లో ఫైవర్ అధికమొత్తంలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన వేరుశనగలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల గ్యాస్, అసిడిటి వంటి సమస్యలు దూరం అవుతాయి.
వెన్నునొప్పి నుంచి ఉపశమనం:
ఈరోజుల చాలామంది గంటలతరబడి కూర్చుండి పనిచేయడం, పెరిగిన పనిభారం కారణంగా శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. రోజంతా కూర్చోవడం వల్ల వెన్ను నొప్పి సమస్యలు వస్తున్నాయి. నానబెట్టిన వేరుశనగలు, బెల్లంతో కలిపి తిన్నట్లయితే వెన్ననునొప్పి తగ్గుతుంది.
ఇది కూడా చదవండి : పోలీసులను ఆశ్రయించిన మాజీ సీఎం కూతురు.. కారణం తెలుసా?