Winter Fish: చలికాలంలో తరచుగా ఫిష్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

చలికాలంలో వచ్చే పలు రకాల జబ్బులకు ఎలాంటి ఆహారాలు తినాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. చలికాలంలో చేపలు తీసుకోవడం వలన దగ్గు, జలుబు, శ్వాస సమస్యలు దూరం అవుతాయి. చేపలు తింటే గుండె సమస్యలను, శరీరంలో వచ్చే వాపులు తగ్గుతాయి.

New Update
Winter Fish: చలికాలంలో తరచుగా ఫిష్ తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Winter Fish: చలికాలంలో వచ్చిందంటే చాలు పలు రకాల జబ్బులు వస్తాయి. కొందరైతే ఎలాంటి ఆహారాలు తినాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తారు. ఎందుకంటే.. వారికి ఏ జబ్బైనా తొందరగా స్ర్పెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే.. చలికాలంలో చేపలు తినవచ్చా..? లేదా..? అనే సందేహాలు చాలా మందిలో ఉంటుంది.చలికాలంలో చేపలు తీసుకోవడం వలన ఎంతో మేలు జరుగుతుందని తాజాగా ఆరోగ్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. శీతకాలంలో ఎక్కువగా చేపలు తీసుకుంటే దగ్గు, జలుబు, లంగ్స్‌ వ్యాధులు, శ్వాస సమస్యలతో బాధపడే వారు..చేపలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు.

సల్మాన్ ఫిష్‌లో పోషకాలు  పుష్కలం

అంతేకాదు.. శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపాల్ని తగ్గిస్తుంది. కంటిచూపుని మెరుగుపరుస్తుందని వైదులు అంటున్నారు. విటమిన్ బి12 ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధులను దూరం చేస్తుంది. ఇలాంటి పోషకాలు సల్మాన్ ఫిష్‌లో పుష్కలంగా ఉంటాయి. చేపలు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడంలో ఎంతో మేలు చేస్తుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను, గుండె సమస్యలను,శరీరంలో వచ్చే వాపులు తగ్గిస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగు పరచడంలో చేపలు ఎంతో పనిచేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు

చలికాలం సీజ‌న్‌లో చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌కు ఎంతో మంచిది. ఇవి ఇన్ఫెక్ష‌న్లు రాకుండా ర‌క్షిస్తాయి. క‌నుక చేప‌ల‌ను త‌ర‌చూ తింటుండాలి. చేపల్లో 9 రకాల అమైనో యాసిడ్స్ మనం ఆరోగ్యవంతంలా ఉండేలా చేస్తాయి. అంతేకాదు శీతకాలంలో చ‌ర్మం స‌హ‌జంగానే పొడిగా ఉంటుంది. అయితే.. చేప‌ల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. దీంతో చ‌ర్మం పొడిబార‌కుండా సుర‌క్షితంగా, మృదువుగా ఉంటుంది. డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న‌వారు కూడా చేప‌ల‌ను తింటే మంచిది. డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మాన‌సిక ప్ర‌శాంత‌తగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈ ఆహారపు అలవాట్లతో మలబద్ధకం సమస్యకు పరిష్కారం.. అవేంటో చూడండి..!!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు