Health Tips: రోజుకు ఏ వయస్సు వారు ఎన్ని గంటలు నిద్ర పోవాలో తెలుసా? నిద్రకు ఆరోగ్యానికి దగ్గరి సంబంధం ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర మనం ఆరోగ్యంగా ఉండేదుకు దోహదపడుతుంది. మీరు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? మీ నిద్రే మీ ఆరోగ్యంగా ఉన్నారో లేదో నిర్ణయిస్తుంది. శరీరంగా సరిగ్గా పనిచేయాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం. లేదంటే వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో వయస్సు ప్రకారం..ఎవరకి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. By Bhoomi 29 Sep 2023 in లైఫ్ స్టైల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి మెరుగైన ఆరోగ్యానికి మంచి నిద్ర చాలా ముఖ్యం. కానీ క్షణం తీరిగ్గా లేని పనలు లేదా మానసిక ఒత్తిడి కారణంగా, ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు మంచి నిద్రను పొందలేకపోతున్నారు. నేటికాలంలో మారుతున్న జీవనశైలి, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మన నిద్ర దెబ్బతింటుంది. మనకు తగినంత నిద్ర రాకపోతే, మనకు అలసట, విశ్రాంతి లేకుండా అనిపిస్తుంది. మన అవసరానికి తగ్గట్టుగా నిద్రపోనట్లయితే మన శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు. ఇవన్నీ మీ పనితీరుతో పాటు మీ శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి వయస్సును బట్టి వేర్వేరు గంటల నిద్ర అవసరం. ఇది జరగకపోతే, దాని దుష్ప్రభావాలు శరీరంపై కనిపించడం ప్రారంభిస్తాయి. అలాంటి పరిస్థితిలో వయస్సు ప్రకారం..ఎవరకి ఎన్ని గంటల నిద్ర అవసరమో ఇప్పుడు తెలుసుకుందాం. మీ వయస్సు ప్రకారం ఎన్ని గంటల నిద్ర అవసరమో తెలుసుకోండి: నవజాత శిశువులు దాదాపు 14-17 గంటలు నిద్రపోవాలి, కానీ వారు 19 గంటల కంటే ఎక్కువ నిద్రపోకూడదు. అదే సమయంలో, 4 నుండి 11 నెలల వయస్సు ఉన్న పిల్లలు 12 నుండి 15 గంటల నిద్రను తీసుకోవాలి, కానీ వారికి కనీసం 10 గంటల నిద్ర సరిపోతుంది. 12 నెలల నుండి 35 నెలల మధ్య వయస్సు పిల్లలు అంటే ఒక సంవత్సరం కంటే ఎక్కువ. 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 12 నుండి 14 గంటల నిద్ర ఉండాలి. 1 నుండి 2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కనీసం 11 నుండి 14 గంటల నిద్ర అవసరం. అయితే వారికి 9 నుండి 16 గంటల నిద్ర కూడా సరిపోతుంది. ఇది కూడా చదవండి: బ్యాంక్ లాకర్ కు చెదలు.. మట్టిగా మారిన రూ.18 లక్షలు.. ఈ దారుణం ఎక్కడంటే? 3 నుండి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు, 10 నుండి 13 గంటల నిద్ర అవసరం. ఈ వయస్సు గల పిల్లలు 8 గంటల కంటే తక్కువ నిద్రపోకూడదు. అంతేకాదు 14 గంటలకు మించకూడదు. 11 సంవత్సరాల కౌమారదశ నుండి 18 సంవత్సరాల వరకు దాదాపు 9 గంటల నిద్ర అవసరం. 18 ఏళ్లు పైబడిన పెద్దలకు సగటున 8 గంటల నిద్ర అవసరం. అదే సమయంలో, వృద్ధులకు కూడా 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. 18-25 సంవత్సరాల వయస్సు గల యువకులకు, 7-9 గంటలు కచ్చితంగా నిద్రపోవాల్సిందే, అయితే ఇది 6 గంటల కంటే తక్కువగా ఉండకూడదు. 11 గంటల కంటే ఎక్కువ ఉండకూడదు. 26 నుండి 64 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు అదే ప్రమాణం ఉంది. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచించారు. వారు 5 గంటల కంటే తక్కువ నిద్రపోకూడదు. 9 గంటలకు మించకూడదని తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఎగ్జామ్స్ పై జగన్ సర్కార్ కీలక నిర్ణయం! #sleep #health-tips #sleep-affects-health #sleep-and-the-body #sleep-and-brain-function #sleep-and-health మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి