Benefits of Sleeping Early: నిద్ర సరిగ్గా లేకుంటే శరీరం రోగాల బారిన పడుతుంది. ఆహారంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. మనం ప్రతిదానికీ ఒక ప్లాన్ చేసుకున్నట్లు నిద్రకు కూడా కావాల్సిన సమయాన్ని కేటాయించారు. ఒక వ్యక్తికి రోజుకు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. అంటే ఏదొక సమయంలో 8 గంటలు నిద్రించడం కాదు. రాత్రిపూట సరైన సమయంలో నిద్రించాలి. మీరు అర్థరాత్రి దాటిన తర్వాత పడుకుని ఉదయం 11 గంటలకు లేస్తాను అంటే అది పరిగణలోకి రాదు. ఇది చాలా చెడ్డ అలవాటు కూడా. మీరు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య నిద్రపోయాంటే..మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒక్క నెలరోజులు ఈ విధంగా అనుసరించి చూడండి. మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయో మీరే గమనించవచ్చు.
తగినంత నిద్ర అవసరం:
ఒక వ్యక్తికి తగినంత నిద్ర చాలా అవసరం. ఈస్ట్రోజెన్ (Estrogen), ప్రొజెస్టెరాన్ (Progesterone),కార్టిసాల్ (Cortisol) వంటి హార్మోన్లను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడుతుంది. తొందరగా నిద్రించినట్లయితే..మీ శరీరం ఈ హార్మోన్లను సరిగ్గా నియంత్రించగలుగుతుంది. ఈ సమయంలో విశ్రాంతి తీసుకుంటే మీ శరీరాన్ని రీఛార్జ్ చేయడంలో సహాయపడటంతోపాటు రోజంతా శక్తిస్థాయిలను పెంచుతుంది.
ఇది కూడా చదవండి: ఆఖరి రోజు కూడా ఆగని పతకాల వేట.. భారత్ కు మొత్తం ఎన్ని మెడల్స్ అంటే?
అభిజ్ఞా పనితీరు మెరుగుపడుతుంది:
శరీరానికి కావాల్సినంత విశ్రాంతిని ఇచ్చినట్లయితే జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును కలిగి ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సరిగ్గా నిద్రపోనట్లయితే..ఆ రోజంతా మూడీగా ఉంటుంది. ఏ పనిమీద ఇంట్రస్ట్ ఉండదు. అదే తొందరగా నిద్రించినట్లయితే..మీ శరీరంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఉదయం 5గంటలకే నిద్రలేస్తారు.
ఊబకాయం, గుండెజబ్బులు:
రాత్రి పదిలోపు పడుకుంటే మీ ఆరోగ్యం బాగుటుంంది. లేదంటే ఊబకాయం, గుండెజబ్బులు, షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే తొందరగా నిద్రించినట్లయితే ఈ దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. రాత్రి తొందరగా నిద్రిస్తే..ఉదయం తెల్లవారుజామునే మేల్కోంటారు. 11 గంటలకు పడుకుంటే..ఆప్పటికే సగం కాలం ముగుస్తుంది. చాలా పనులు నిలిచిపోతాయి. రాత్రి తొందరగా పడుకుంటే హార్మోన్లు మన కంట్రోల్లో ఉంటాయి. కళ్ల కింద నల్లటివలయాలు రావు. అందం మెరుగుపడుతుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 70 కంపెనీల్లో 2500+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!
ఇక ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే..రాత్రి లైట్స్ ఆఫ్ చేసుకుని మొబైల్స్, ల్యాప్ టాప్స్ అస్సలు చూడకూడదు. ఇది మీ ఆయుష్సును తగ్గిస్తుంది. రాత్రి ఉద్యోగం చేసేవారికి ఈ అవకాశం ఉండదు. రాత్రి పడుకునేవాళ్లు 8 నుంచి 10 గంటల మధ్య నిద్రిస్తే జీర్ణవ్యవస్థ కూడా బాగుంటుంది. యవ్వనంగా ఉండాలంటే రాత్రి 7గంటలలోపు భోజనం చేసిన రాత్రి 9గంటల లోపు నిద్రించాలని నిపుణులు సూచిస్తున్నారు.