Exploring the Benefits Of Capsicum - Spring Onions Always Fresh Tips: కాయకూరల్లో కొన్ని ఖరీదైన వాటినికి నిల్వ చేయడం కష్టంగా ఉంటుంది. ఫ్రిజ్‌లో కొన్ని రకాల కాయగూరలని ఉంచిన అవి వెంటనే పాడైపోతాయి. వాటిని ఎలా నిల్వ చేయలో అర్థంకాక చాలా మంది సతమతమవుతుంటాం. పోనీలే అని వాటిని వెంటనే వండటం కుదురుతుందా..? అంటే ఒక్కొసారి వాండటం అస్సలు వీలు కాదు. అయితే.. ఈ కూరగాయాలు త్వరగా పడుకాకుండా..పెద్దవాళ్లు మరియు కొందరూ కొన్ని చిట్కాలు చెబుతుంటారు. అవి ఫాలో అయితే బాగా పనిచేసి మన ఇబ్బంది తీరుతుంది. అలాంటి కొన్ని ఇంటి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ నిల్వ ఉండాలంటే..
- ఓ గాజుసీసాలో నీళ్లుపోసి స్ప్రింగ్ ఆనియన్స్ (Spring Onions) వేర్లు మునిగేలా పెడితే కొన్ని రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇలా పెడితే.. పచ్చని భాగం పెరుగుతూ ఉంటుంది. మనకి అవసరం ఉన్నప్పుడల్లా కొద్దిగా కట్ చేసుకోని వాడుకోవచ్చు.
- మిగిలిపోయిన బ్రెడ్ స్లైసులను మిక్సీ చేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా దోరగా వేయించి మంచి డబ్బాలో నిల్వ చేసుకోవాలి. క్రిస్పీ వెజ్ నాన్‌వెజ్ వంటకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
- క్యాప్సికాన్ని పేపర్ బ్యాగ్‌లో చుట్టిపెట్టి, రిఫ్రిజిరేటర్‌లో పెడితే కొన్ని రోజులు తాజాగా ఉంటాయి
నల్లగా జిడ్డుపట్టిన పాత్రలపై బేకింగ్ సోడాలో వెనిగర్ వేయాలి. 20 నిమిషాలు తరువాత డిష్‌వాషర్‌తో తోమితే నలుపంతా పోయి కొత్తదానిలా పాత్ర మెరుస్తుంది.
ఇది కూడా చదవండి: మహిళలకు వరం.. తామర పువ్వుల రసం..ఎన్నో సమస్యలకు చెక్
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: వైరల్‌గా మారిన వందేళ్ల చెట్టు…అందానికి నెటిజన్ల ఫిదా