Weight Loss: బరువు తగ్గడం కోసం ఈ పని చేస్తున్నారా..అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే!

చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ..ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వారుస్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్ వాడటం, వర్కౌట్స్ చేయడం.. ఇలా తమకు నచ్చిన పద్ధతులు ఫాలో అవుతారు.కానీ ఈ ఒక్క పని చేస్తే లైఫ్ రిస్క్ లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు.అదేంటో తెలుసుకోండి!

Weight Loss: బరువు తగ్గడం కోసం ఈ పని చేస్తున్నారా..అయితే మీ లైఫ్ రిస్క్ లో పడినట్టే!
New Update

ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం, అధిక బరువు సమస్య తీవ్రమవుతోంది. ఏటా దీని బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ చేయకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. అధిక బరువుతో బాధపడుతున్నవారు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. స్పెషల్ డైట్, కొన్ని రకాల మెడిసిన్ వాడటం, వర్కౌట్స్ చేయడం.. ఇలా తమకు నచ్చిన పద్ధతులు ఫాలో అవుతారు. అలాగే కొందరు రాత్రిపూట భోజనం (Dinner) చేయడం మానేస్తారు. అయితే ఇది చాలా ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.

* రాత్రిభోజనం ఆరోగ్యానికి కీలకం

రాత్రి భోజనం శరీరానికి చాలా అవసరం. నిద్ర వేళకు ముందు శరీరానికి అవసరమైన కేలరీలు, పోషకాలను అందిస్తుంది. 24 గంటల కాలచక్రంలో నిద్ర సమయంలో ఆహారం లేకుండా శరీరం ఎక్కువ సమయం ఉంటుంది. అందుకే శరీర అవసరాల కోసం డిన్నర్ చాలా కీలకం.

* ఆరోగ్యంపై ప్రభావం

బరువు తగ్గాలనే ఆత్రుతతో రాత్రిపూట భోజనం మానేస్తే స్వల్పకాలిక ప్రయోజనం ఉండవచ్చు. అయితే అది దీర్ఘకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తుంది. ఈ అలవాటు వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇది మొత్తం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. ఎందుకంటే రాత్రిపూట భోజనం మానేయడం జీవక్రియ రేటును ప్రభావితం చేస్తుంది. ఆకలి కోరికలను పెంచుతుంది. ఇది సూక్ష్మపోషకాల లోపాలకు దారితీస్తుంది. డిన్నర్ మానేయడం వల్ల నిద్ర నాణ్యత లోపిస్తుంది, శరీరంలో ఎనర్జీ లెవల్స్ తగ్గుతాయి.

* షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులు

రాత్రిపూట భోజనం చేయకపోతే రక్తంలో షుగర్ లెవల్స్ హెచ్చుతగ్గులకు గురికావచ్చు. ఇది శరీర వణుకుడుకు దారితీయవచ్చు. షుగర్ పేషెంట్లు బరువు తగ్గడానికి డిన్నర్ స్కిప్ చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇది బ్లడ్ షుగర్‌ లెవల్స్‌ను ప్రభావితం చేస్తుంది. మానసిక ఆరోగ్యంపై కూడా ఎఫెక్ట్ ఉంటుంది.

* డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి

ఇన్నోవేషన్ ఇన్ ఏజింగ్ అనే జర్నల్‌లో 2020లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. రాత్రి భోజనం మానేసిన వృద్ధుల్లో డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్రలేమి లక్షణాలు కనిపించినట్లు ఈ స్టడీలో తేలింది. అందుకే సరైన సమయంలో సమతుల్య ఆహారం తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడానికి సమయం పడుతుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. వెయిట్ లాస్ జర్నీలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జంక్‌ఫుడ్ జోలికి వెళ్లకూడదు. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను డైట్‌లో చేర్చుకోవాలి. రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేయాలి. ఆఫీస్, అపార్ట్‌మెంట్‌లలో లిఫ్ట్‌ వినియోగానికి బదులు మెట్లు ఎక్కాలి. వేగంగా నడవడం, ఈత కొట్టడం, సైక్లింగ్ చేయడం, డాన్స్ వంటి యాక్టివిటీస్ చేస్తూ బరువు తగ్గడానికి కృషి చేయాలి. కేలరీల ఇన్‌టేక్ తగ్గించాలి. ప్రొటీన్ ప్రొడక్ట్స్ వాడాలి, వాటర్ ఎక్కువగా తాగాలి. ఇలాంటి ఆరోగ్యకర జీవనశైలి అలవాట్లతో, ఆరోగ్యంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

#health-care #weight-loss #healthy-food #weight-loss-tips
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe