PM Modi : ప్రధాని మోదీ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. తమిళనాడు(Tamilnadu) డీఎంకే మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్(Anitha R Radhakrishnan) పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ(BJP) నేతల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. 'తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు నిద్రిస్తున్నప్పుడు హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా ?' అంటూ ఆరోపణలు చేశారు. కమల్ రాజును హత్తుకున్నట్లు చెప్పడంపై ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read : కేజ్రీవాల్ ఎలా ఆదేశాలిచ్చారు.. సీరియస్ అయిన ఈడీ
మంత్రి రాధాకృష్ణన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) ఖండించారు. డీఎంకే నేతలు అసభ్య పదజాలంతో దిగజారిపోతున్నారంటూ విమర్శించారు. డీఎంకే నేత కనిమోళి సమక్షంలోనే రాధాకృష్ణన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగా.. ఆమె చూస్తూ ఉండిపోయారని ఆరోపించారు. మరోవైపు మంత్రి రాధాకృష్ణన్ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీజేపీ నేతలు ఎన్నికల కమిషన్‌తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదిలాఉండగా.. ఇటీవల ప్రధాని మోదీ తమిళనాడులోని ఎన్నికల ప్రచార ర్యాలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు ప్రవేశపెట్టిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. అలాగే ఆయన తీసుకొచ్చిన మధ్యాహ్న భోజన పథకం తనకు స్పూర్తినిచ్చిందని అన్నారు. దీనిపై స్పందించిన డీఎంకే మంత్రి కమల్ రాజు ప్రధాని మోదీపై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది.
Also Read : 2025 నాటికల్లా భారతీయులందరికీ కనీస వేతనాలు!