Telangana: కేంద్రమంత్రి పదవిపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్‌..

తెలంగాణలో బీజేపీకి 8 ఎంపీ సీట్లు రావడంతో కేంద్రమంత్రి పదవి కోసం పలువురు నేతలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని.. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు.

Telangana: కేంద్రమంత్రి పదవిపై డీకే అరుణ షాకింగ్ కామెంట్స్‌..
New Update

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్‌తో సమానంగా బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి పలువురు ఎంపీలకు కేంద్రమంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. దీనికోసం ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై తాజాగా మహబూబ్‌నగర్‌ ఎంపీ డేకే అరుణ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పదవి కోసం లాబీయింగ్ చేయడం లేదని.. అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలనకు రెఫరెండమని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు 14 స్థానాల్లో విజయం సాధిస్తామన్నారు.. ఇప్పుడేమైంది అంటూ ప్రశ్నించారు.

Also Read: హీరో టూ జీరో.. ప్రధాని రేసు నుంచి పతనానికి కేసీఆర్!

'ప్రధాని మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదు.. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడినందుకు రేవంత్‌ సీఎం పదవి నుంచి వైదొలగాలి. బీఆర్‌ఎస్ ఆత్మబలిదానం చేసుకుని బీజేపీను గెలిపించిందని రేవంత్‌ తప్పు ప్రచారం చేశారు. మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ ఓడితే అభివృద్ధి జరగదని చెబుతూ.. ఆయనే అభ్యర్థిలా వ్యవహరించారు. కర్ణాటక నుంచి వచ్చిన నేతలు కొందరు నేతలు ఎన్నికల్లో డబ్బులు పంచారు. బీజేపీకి తెలంగాణలో 10 సీట్లు వస్తాయని అంచనా వేశాం. కానీ 8కి పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిగ్రామానికి, ఇంటిగకీ మోదీ అభివృద్ధి నినాదం వెళ్లింది. బీజేపీని అడ్డుకోవడం కోసం రిజర్వేషన్లు తీసేస్తారని రేవంత్‌ అసత్య ప్రచారం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో ఇక్కడి ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉండాలని' డీకే అరుణ అన్నారు.

Also Read: లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై స్పందించిన చైనా..

#telugu-news #bjp #dk-aruna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe