Hyderabad: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ.. ఎంతమంది వచ్చారంటే

మృగశిర కార్తెను పురస్కరించుకొని హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ఆదివారం ఉదయం పూర్తయింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 55,440 మంది ఆస్తమా వ్యాధిగ్రస్థులు చేప ప్రసాదం తీసుకున్నారని అధికారులు తెలిపారు.

New Update
Hyderabad: ముగిసిన చేప ప్రసాదం పంపిణీ.. ఎంతమంది వచ్చారంటే

Fish Prasadam: మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబ సభ్యులు (Bathini Family) నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ ఆదివారం ఉదయం పూర్తయింది. 24 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, ఛత్తీస్‌గఢ్, బిహార్, హర్యాణా తదితర రాష్ట్రాలకు చెందిన మొత్తం 55,440 మంది ఆస్తమా వ్యాధిగ్రస్థులు చేప ప్రసాదం తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ ముగిసిన అనంతరం.. బత్తిని సోదరులు హైదరాబాద్‌లోని దౌద్‌బౌలిలో వారి ఇంట్లో కూడా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు.

Also Read: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..

Advertisment
Advertisment
తాజా కథనాలు