ఆగస్టు 9న పాక్ జాతీయ అసెంబ్లీ రద్దు: పాక్ ప్రధాని వెల్లడి...!!

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఆగస్టు 9న రద్దు కానుంది. ఈ విషయాన్ని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ గురువారం ప్రకటించారు. పార్లమెంటు సభ్యుల గౌరవార్థం జరిగిన విందులో పార్లమెంటరీ నేతలతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.

Pakistan : పాకిస్తాన్ పార్లమెంట్ రద్దు...షాబాజ్ ఉద్దేశం ఏంటో తెలుసా?
New Update

Pakistan National Assembly : పాకిస్థాన్ లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈనెల 9న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రధాని షెహనాజ్ షరీఫ్(Pakistan PM Shehbaz Sharif) ప్రకటించారు. ఆగస్టు 12వ తేదీతో పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుండటంతో అసెంబ్లీ రద్దు తేదీని ప్రకటించారు. త్వరలో ఎలక్షన్ కమిషన్ ఎన్నికల తేదీని ప్రకటిస్తుందని షెహబాజ్ తెలిపారు. తాజా పరిణామాలతో పాక్ రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ రద్దు చేసిన రెండు నెలలోపు సాధారణ ఎన్నికలు నిర్వహించాలి.

షహబాజ్ షరీఫ్ జాతీయ అసెంబ్లీని (Pakistan National Assembly) రద్దు చేయాలని రాష్ట్రపతికి అధికారిక సలహా పంపనున్నారు. రాజ్యాంగ నిబంధనల (Constitutional provisions) ప్రకారం, సలహా అమలులోకి రావాలంటే రాష్ట్రపతి 48 గంటల్లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. ఏదైనా కారణం చేత రాష్ట్రపతి సలహాపై సంతకం చేయకపోతే, జాతీయ అసెంబ్లీ ఆటోమెటిగ్గా రద్దవుతుంది.

విపక్షాలతో మూడు రోజుల సంప్రదింపుల అనంతరం తాత్కాలిక ప్రధాని పేరును రాష్ట్రపతికి సమర్పిస్తామని ప్రధాని షెహబాజ్ తెలిపారు. అయితే, ఒప్పందం కుదరకపోతే, పాకిస్తాన్ ఎన్నికల సంఘం (ECP) జోక్యం చేసుకుని, ప్రతిపాదిత పేర్లలో తాత్కాలిక ప్రధాన మంత్రి పదవికి అభ్యర్థిని నామినేట్ చేస్తుంది. ఈ వారం ప్రారంభంలో, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లో రాబోయే ఎన్నికలు 2023 డిజిటల్ జనాభా లెక్కల ఆధారంగా జరుగుతాయని చెప్పారు.

కొత్త జనాభా లెక్కల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. జనాభా లెక్కలు పూర్తయ్యాక దాని ఆధారంగానే ఎన్నికలు నిర్వహించాలి తప్ప అధిగమించలేని అడ్డంకులు ఏవీ ఉండవని నా అభిప్రాయమని ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెహబాజ్ తెలిపారు. జనాభా గణన ఫలితాలను ఆమోదించే సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్ (CCI) సమావేశం జరగాలని భావిస్తున్నట్లు పీఎం షరీఫ్ తెలిపారు. జనాభా లెక్కల ఫలితాలు ఖరారైన వెంటనే సీసీఐకి పంపుతామని తెలిపారు.

Also Read: లోయలో పడిన బస్సు..18 మంది మృతి..వారిలో ఆరుగురు భారతీయులు!

#pakisthan #pakistan-pm-shehbaz-sharif #pak-national-assembly #pak-pm-shehbaz-sharif #pakistan-national-assembly-to-be-dissolved-on-august-9
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe