Prakasham YCP Leaders: వైసీపీ అధినేత, సీఎం జగన్ కు ఎన్నికల ముందు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వనున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోసం కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం జగన్ మార్చగా.. సీఎం జగన్ నిర్ణయాన్ని కొందరు వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలో వైసీపీలో అసమ్మతి మొదలైంది. మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) మద్దతుగా యర్రగొండపాలెం నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు మంత్రి సురేష్ సంబంధించిన జార్జ్ ఇంజనీరింగ్ కళాశాలలో సమావేశం ఈ రోజు సమావేశమయ్యారు.
ALSO READ: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!
మంత్రి సురేష్ ని కొండేపి ఇంఛార్జిగా అధిష్టాన ప్రకటనను వ్యతిరేకిస్తూ నాయకుల సమావేశం సమావేశమయ్యారు. సమావేశం అనంతరం మంత్రి సురేష్ మద్దతుగా పలువురు ఎంపీటీసీలు ,జడ్పీటీసీలు సర్పంచులు, ఉప సర్పంచులు పార్టీకి సంబంధించిన నాయకులు రాజీనామా చేశారు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం కొత్త వ్యక్తిని ప్రకటిస్తే నాయకులను కూడా కొత్తవారిని చూసుకోవాలంటూ ఒంగోలు మూర్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇంఛార్జిల మార్పు అందుకోసమే.. సజ్జల బుజ్జగింపు
నిన్న(బుధవారం) ఇంఛార్జిల మార్పుపై ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంఛార్జిల మార్పులతో కొంతమంది బాధ, ఆవేదన ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని సర్దుకుంటాయని తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఏం చెప్పి అధికారంలోకి వచ్చామో అదే చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో వచ్చినప్పుడు బాధ్యతగానే పని చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యేలకు, ఇంఛార్జిలను సీటు ఇవ్వమని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజల మద్దతు పొందాలని సీఎం జగన్ (CM Jagan) చెప్పారని తెలిపారు. సిట్టింగ్ లు మార్పులు అనేది ఎన్నికలు ముందు జరిగే సాధారణ ప్రక్రియ అని వైసీపీ నాయకులకు క్లారిటీ ఇచ్చారు.
ALSO READ: Telangana MP’s: రాజీనామాలు చేసిన తెలంగాణ ఎంపీలు