/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-05T184911.011-jpg.webp)
Disha Patani With Prabhas -Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2898 AD'. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని వైజయంతి బ్యానర్ పై అశ్విని దత్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హాట్ బ్యూటీస్ దిశా పటానీ, దీపికా పదుకొనె తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 70% శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ ప్రభాస్, దిశా పటానీ కాంబినేషన్ లో కొన్ని రొమాంటిక్ సీన్స్ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.
ఇటలీలో ప్రభాస్ - దిశా పటానీ
అయితే ఇటలీ షూటింగ్ లో పాల్గొంటున్న హాట్ బ్యూటీ దిశా (Disha Patani) తాజాగా.. తమ షూటింగ్ కష్టాలను నెట్టింట షేర్ చేసింది. మైనస్ డిగ్రీల చలిలో దుప్పటి కప్పుకొని వణికిపోతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. దానికి "Italy photo dump..@ 'కల్కి 2898 AD" అనే క్యాప్షన్ జోడించింది ఈ బ్యూటీ. అలాగే సెట్స్ లో ప్రభాస్ తో కలిసి ఉన్న కొన్ని క్యూట్ ఫోటోలను కూడా షేర్ చేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_420199191_18441234031013912_63501715933123155_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_420330260_18441234049013912_6285820511468423940_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_420200611_18441234028013912_2474439943399108621_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_420320835_18441234010013912_5620788669246302115_n_1080-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Snapinsta.app_420175295_18441234040013912_8194089856721083549_n_1080-jpg.webp)
Follow Us