Pending Challans: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలు మాత్రమే!

వాహనదారులకు బిగ్ అలర్ట్. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ఇంకా పెండింగ్ చలాన్లు చెల్లించని వారు ఉంటే.. వెంటనే చలాన్లు క్లియర్ చేసుకోవాలని పోలీస్ శాఖ కోరింది. చలాన్లపై రాయితీ ప్రకటించడం ద్వారా గత ఏడాది రాష్ట్ర ఖజానాకు రూ.300కోట్లు సమకూరాయి.

New Update
Pending Challans: వాహనదారులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటలు మాత్రమే!

TS Pending Challans: తెలంగాణ(Telangana) వాహనదారులకు అలర్ట్. పెండింగ్ చలాన్ల పై ప్రభుత్వం కల్పించిన డిస్కౌంట్ ఆఫర్(Discount Offer) మరి కొన్ని గంటల్లో ముగియనుంది. ఇంకా పెండింగ్ చలాన్లు చెల్లించని వారు వెంటనే చలాన్లు క్లియర్ చేసుకోవాలని పోలీస్ శాఖ కోరింది.

ALSO READ: BSPకి షాక్… కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు

రెండు సార్లు పొడిగింపు..

వాహనదారులకు పెండింగ్ చలాన్ల (Pending Challans) నుంచి ఉపశమనం కలిపించేందుకు గత ఏడాది డిసెంబర్‌ 27న చలాన్ల రాయితీని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మొదట 15 రోజులు గడువు ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత జనవరి 31 వరకూ పెండింగ్ చలాన్లు కట్టేందుకు అవకాశం కలిపించింది. తాజాగా మరోసారి 15 రోజులు గడువును పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్‌ చలాన్లు ఉన్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ 44 శాతం మాత్రమే పెండింగ్‌ చలాన్ల చెల్లించినట్లు పేర్కొంది. డిసెంబర్‌ 27 నుంచి జనవరి 30 వరకూ రూ.139 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారాలు గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.

https://echallan.tspolice.gov.in/

డిస్కౌంట్‌ల వివరాలు :

* ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం రాయితీ.
* టూ వీలర్ చలాన్లపై 80 శాతం రాయితీ.
* ఫోర్ వీలర్స్, ఆటోల చలాన్లపై 60 శాతం రాయితీ.
* లారీ, ఇతర భారీ వాహనాల చలాన్లపై 50 శాతం రాయితీ.

బీఆర్ఎస్ హయాంలో రూ.300 కోట్లు..

2022లో గత ప్రభుత్వం చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు ట్రాఫిక్ చలానాలపై రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఖజానాలోకి భారీ డబ్బు సమకూరింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెండింగ్ చలానాలు కట్టడం వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు జమ అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

ALSO READ: పెన్షన్లలో కేసీఆర్ సర్కార్ అవినీతి.. కాగ్ సంచలన రిపోర్ట్ 

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు