TS DSC: 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ!

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులకు నిరాశే మిగలనుంది. 4లక్షల మంది అర్హులుండగా 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ సీఎం రేవంత్ కు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్‌ పలు సూచనలు చేశారు.

TS DSC: 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ!
New Update

Telangana: తెలంగాణలో మెగా డీఎస్సీ (DSC) నోటిఫికేషన్ లో బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగలనుంచి. రేవంత్ సర్కార్ 11,062 టీచర్ పోస్టుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కేవలం 2692 మాత్రమే ఉన్నాయి. దీంతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులంగా ఆందోళన చెందుతున్నారు. 4 లక్షల మంది అర్హత సాధించగా కేవలం రెండు వేలు ఖాళీలను భర్తీ చేయడం దారుణమంటూ వాపోతున్నారు. ఈ క్రమంలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ చాలా మంది బీఈడీ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్‌ (CM REVANTH) రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌ (RSP) కుమార్‌ ట్వీట్ చేశారు.

ఈ మేరకు 11,062 పోస్టుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ.. అయితే దాదాపు 4 లక్షల మంది బీఈడీ అభ్యర్థుల‌కు కేవలం 2692 స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ప్రకటించడం అన్యాయం అని అన్నారు. అలాగే ఈ పోస్టుల సంఖ్యను పెంచాలని కోరుతూ.. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ నిర్వహించిందని, మీరు ఏటా రెండు సార్లు చేపట్టాలని ప్రవీణ్ కుమార్ సూచించారు. నిరుద్యోగులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలను పరిశీలించాలని కోరుతూ సీఎంకు పలు సూచనలు చేశారు.

గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి..
మీరు మెగా డీయస్సీ పేరుతో దాదాపు 11,000 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఈ వార్త చాలా మంది బీఎడ్ (BEd) అభ్యర్థులకు తీవ్ర నిరాశ మిగిలించింది. దాదాపు గా నాలుగు లక్షల మందికి కేవలం 2629 స్కూల్ అసిస్టెంటు పోస్టులే చూపించడం అన్యాయం. నిరుద్యోగులు నా దృష్టికి తీసుకొచ్చిన కొన్ని అంశాలను మీముందుంచుతున్నాను. దయచేసి పరిశీలించగలరు.

1. సుప్రీంకోర్టు తీర్పు మేరకు బీఎడ్ (BEd) అభ్యర్థులకు ఎస్జీటీ (SGT) పోస్టులకు అర్హత లేనట్లే. ఈ లెక్కన కొత్త BEd కాలేజీలకు అనుమతి ఇవ్వకపోవడం మంచిది.

2. BEd చేసిన వారు పాఠశాల విద్యాశాఖలో కేవలం స్కూల్ అసిస్టెంటుకు మాత్రమే అర్హులు. వాళ్ల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షలు ఉన్నది. కాని కేవలం 2629 పోస్టులే ప్రకటిస్తున్నట్లుగా వార్తలొస్తున్నయి. ఈ పోస్టులు ఎలాగైనా పెంచే విధంగా చూడగలరు.

ఇది కూడా చదవండి: TS DSC: మెగా డీఎస్సీకి ముందు టెట్ నోటిఫికేషన్? అభ్యర్థుల్లో కొనసాగుతున్న ఉత్కంఠ!

3. గత ప్రభుత్వం కేవలం మూడు సార్లే టెట్ (TET) నిర్వహించింది. నిజానికి టెట్ సంవత్సరానికి రెండు పర్యాయాలు నిర్వహించాలి. ఈ సారి కూడా టెట్ నిర్వహించి నోటిఫికేషన్ వేయడం చేస్తే బాగుంటుంది. లేదా టెట్, డీయస్సీ రెండూ ఒకే సారి కూడా చేస్తే చాలా మందికి అర్హత వచ్చే అవకాశం ఉంది. Online కాబట్టి పెద్దగా సమస్య ఉండక పోవచ్చు.

4. ఎస్జీటీ నుండి స్కూల్ అసిస్టెంటు ప్రమోషన్ల‌లో నిష్పత్తి ప్రస్తుతం 70:30 ఉంది. అంటే 70 శాతం పదోన్నతి, 30 శాతం డైరెక్టు రిక్రూట్‌మెంట్‌. దీని వల్ల బీఎడ్ (BEd) అభ్యర్థులకు పోస్టులు తక్కువ కావడమే కాకుండా సంస్థలో vitality దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే కొన్ని గురుకులాల్లో లాగా ఈ నిష్పత్తిని 50:50 లాగా సర్వీసు రూల్స్‌ను మారిస్తే అందరికీ లాభమైతది.

5. చాలా కాలంగా ఆర్ట్‌, క్రాఫ్ట్, మ్యూజిక్, లైబ్రేరియన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఆగి పోయింది. వీళ్లను ఎంత అర్జంటుగా రిక్రూట్ చేస్తే (ప్రతి స్కూల్‌కు ఒకరు) అంత మంది తెలంగాణ బిడ్డలు సృజనాత్మకంగా,ఆరోగ్యంగా తయార‌వుతారు.

6. పాఠశాలల్లో మానసిక నిపుణులను (కౌన్సిలర్లు) ను నియమిస్తే తప్పకుండా విద్యార్థులపై ఒత్తిడి తగ్గి ఆత్మహత్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది.

7. డీఎస్సీ 2008 అభ్యర్థులు న్యాయం కోసం తొక్కని గడప లేదు. వారికి పక్క రాష్ట్రంలో న్యాయం జరిగింది. మన దగ్గర కూడా వాళ్ల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయగలరు.

8. గురుకులం ఆశావహులు బ్యాక్‌ లాగ్ ఖాళీలను ఎలాగైనా భర్తీ చేయాలని, ‘అవరోహణ క్రమంలో’ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు.

#telangana #mega-dsc #bed-candidates #disappointment
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe