Sandeep Vanga: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ

సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబోలో రాబోతున్న మూవీ స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ మాంత్రికుడిగా కనిపించబోతున్నారనే టాక్ నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ హర్రర్ మూవీ కాదని.. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని క్లారిటీ ఇచ్చారు.

New Update
Sandeep Vanga: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ

Prabhas Spirit Movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2', నాగ అశ్విన్ దర్శకత్వంలో కల్కి , మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రాలు చేస్తున్నారు. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగా (Sandeep Vanga), ప్రభాస్ (Prabhas) కాంబోలో త్వరలోనే ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత ఈ మూవీ సంబంధించి మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.

Also Read: Mangalavaram Movie: టీవీలో ‘మంగళవారం’ హవా.. అదిరిపోయే TRP రేటింగ్

దీంతో సినిమా పై ఊహాగానాలు ఎక్కువైపోయాయి. ముఖ్యంగా గత కొద్దిరోజులుగా 'స్పిరిట్' స్టోరీ లైన్ పై నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక రూమర్ వైరలవుతూ వస్తుంది. రీసెంట్ గా 'స్పిరిట్' ఒక హర్రర్ మూవీ అని.. ఇందులో ప్రభాస్ మాంత్రికుడు పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వినిపించిన సంగతి తెలిసిందే.

Prabhas Spirit Movie

'స్పిరిట్' స్టోరీ లైన్ పై సందీప్ వంగ క్లారిటీ

అయితే తాజాగా ఈ రూమర్స్ పై స్పందించారు డైరెక్టర్ సందీప్ వంగ. ఇటీవలే ఓ బాలీవుడ్ సినిమా టీజర్ లాంచ్ లో పాల్గొన్న సందీప్.. స్పిరిట్ స్టోరీ లైన్ ఏంటో చెప్పేశారు. "ప్రభాస్ తో తెరకెక్కించబోతున్న సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. ప్రస్తుతం స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. అందరూ ఊహిస్తున్నట్లు ఇది హర్రర్ సినిమా కాదు. 'స్పిరిట్' ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ. ఈ సినిమాలో ప్రభాస్ ను సరికొత్తగా చూస్తారు అంటూ క్లారిటీ ఇచ్చారు సందీప్ వంగ".

Also Read : Samantha Ruth Prabhu: సమంత వర్క్ ఔట్స్.. ఆ సినిమా కోసమే.. వైరలవుతున్న పోస్ట్

#spirit-movie-story-line #Spirit Movie #Sandeep Reddy Vanga #prabhas
Advertisment
తాజా కథనాలు