KS Ravikumar about Balakrishna : తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్(KS Ravi Kumar) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడు, నిర్మాత, దర్శకుడిగా ఎన్నో చిత్రాలకు పని చేశారు. రవికుమార్ ఎక్కువగా తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ చిత్రాలు నరసింహ, స్నేహం కోసం, దశావతారం, లింగ, జైసింహా, రూలర్ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఈయన నటన పై ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
Also Read : Uday Kiran: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
అయితే తాజాగా ఈ దర్శకుడు నందమూరి బాలకృష్ణ(Balakrishna) పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియా(Social Media) లో వైరల్ గా మారాయి. ఇటీవలే గార్డియన్ అనే తమిళ మూవీ ప్రెస్ మీట్ కు హాజరైన కేఎస్. రవికుమార్ బాలయ్య ప్రవర్తన గురించి సంచలన కామెంట్స్ చేశారు.
బాలకృష్ణ పై కేఎస్. రవికుమార్ కామెంట్స్
'గార్డియన్'(Guardian) మూవీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే బాలయ్య అస్సలు తట్టుకోలేరు. అంతా తనను చూసే నవ్వుకుంటున్నారని భావిస్తాడు. అలా నవ్వితే ఆయనకు వెంటనే కోపం వచ్చేస్తుంది . నవ్వే వ్యక్తిని పిలిపించి మరీ కొడతారు. అలాగే ఒక సారి నా అసిస్టెంట్ ను కూడా కొట్టబోయారు. ఒక తన విగ్గును చూసి నవ్వున్నాడని అనుకోని అతని పై కోపంతో అరిచేశారు. ఆ సమయంలో నేను అడ్డుపడి సర్ది చెప్పాను అంటూ బాలయ్య ప్రవర్తన పై షాకింగ్ కామెంట్స్(Shocking Comments) చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. కేఎస్. రవికుమార్ బాలకృష్ణతో జై సింహా, రూలర్ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.
దీని పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కేఎస్. రవికుమార్ కు ఎలాంటి అవకాశాలు లేని సమయంలో జై సింహా, రూలర్ వరుసగా రెండు సినిమాలకు పిలిచి మరీ అవకాశం ఇచ్చిన బాలయ్య పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటీ అని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. అయితే బాలయ్య ఎంత కూల్ గా ఉంటారో.. కోపం వస్తే మాత్రం ముందు వెనుక ఆలోచించరని టాక్ ఉంది. కొన్ని సార్లు కోపంతో కొట్టేస్తారు అని కూడా అంటారు. అంతే కాదు గతంలో కూడా పలు సార్లు బాలయ్య ఫ్యాన్స్ పై ఫైర్ అయిన వీడియోలు చాలానే వైరలయ్యాయి. పబ్లిక్ లో అభిమానులను కొట్టడం, సెల్ఫీ కోసం వస్తే పక్కకు నెట్టేయడం వంటి వీడియోలు దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఓ ప్రముఖ దర్శకుడు కూడా బాలయ్య ప్రవర్తన పై ఇలా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Samantha: సమంతతో తిరుమలలో ప్రత్యక్షమైన ప్రీతం.. మరోసారి టాలీవుడ్ లో గుసగుసలు