Director Puri Jagannadh About Double Ismart Song : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న దర్శకుడు పూరి జగన్నాథ్. తన సినిమాల్లోని యూత్‌ఫుల్ ఎలిమెంట్స్, డైలాగ్స్, కామెడీ టైమింగ్‌లతో ప్రేక్షకులను అలరించిన ఈ దర్శకుడు, తన సినిమాల్లోని పాటల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. అలాంటి పాటలలో రీసెంట్ గా వచ్చిన 'మార్ ముంతా చోడ్ చింత' సాంగ్ ఒకటి. రామ్ పోతినేని, పూరీ కాంబోలో తెరకెక్కుతున్న 'డబుల్ ఇస్మార్ట్' మూవీలోని ఈ పాట విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
పాటలోని బీట్స్, లిరిక్స్, అలాగే పాటకు తీసిన వీడియో కూడా ప్రేక్షకులను అమి తంగా అలరించాయి. దీంతో ఆడియన్స్ నుంచి ఈ సాంగ్ కు విశేష ఆదరణ వచ్చిన సందర్భంగా.. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పూరి జగన్నాథ్ ఆ పాట గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. "ఇస్మార్ట్ శంకర్’లో దిమాక్ ఖరాబ్ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సీక్వెల్‌లో అలాంటి పాటే చేయడం సవాలుతో కూడుకున్న విషయం. కొత్త పాట ‘దిమాక్ ఖరాబ్’ను మించి ఉండాలనే ఉద్దేశంతో సంగీత దర్శకుడు మణిశర్మ చాలా కష్టపడ్డారు.
Also Read : నువ్వెంతా? నీ బతుకెంతా?.. కిరాక్ ఆర్పీపై దుమ్మెత్తి పోసిన బాబూమోహన్!
‘ఇస్మార్ట్ శంకర్’లో ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ డైలాగ్ ఉంది. తెలంగాణలో ఫేమస్ అది. దాన్నే లీడ్‌గా తీసుకుని పాటను రూపొందించాం. ‘మార్ ముంతా ఛోడ్ చింతా’ ను రాహుల్ సిప్లిగంజ్ (తెలుగులో) పాడాడు. ఈ సాంగ్ రాకతో.. చాలామంది ‘దిమాక్ ఖరాబ్’ను మర్చిపోయి ఉంటారు. ఈ కొత్త పాటకు విజయ్ కొరియోగ్రఫీ చేశారు.
ఆయనతో కలిసి పని చేయడం ఇదే తొలిసారి. రామ్ డ్యాన్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఎలాంటి స్టెప్పు అయినా అవలీలగా వేస్తాడు. ఆ విషయంలో రామ్‌ని మ్యాచ్ చేయడం చిన్న విషయం కాదు. అలాంటిది హీరోయిన్ కావ్యా థాపర్.. రామ్‌తో సమానంగా డ్యాన్స్ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో ఎంజాయ్ చేయాల్సిన సాంగ్ ఇది" అని తెలిపారు.