Hanuman 100 Days: 100 డేస్ థియేట్రికల్ రన్.. 'హనుమాన్' సంచలనం..!

యంగ్ హీరో తేజ సజ్జ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'హనుమాన్' నేటితో 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎక్స్ లో స్పెష‌ల్ పోస్ట్ పెట్టారు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు అని తెలిపారు.

New Update
Hanuman 100 Days: 100 డేస్ థియేట్రికల్ రన్.. 'హనుమాన్' సంచలనం..!

Hanuman 100 Days: టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 'హనుమాన్'. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. గతేడాది అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన హనుమాన్.. తాజాగా మరో అద్భుతాన్ని సాధించింది.

100 డేస్ థియేట్రికల్ రన్

ప్రస్తుతం ఒక సినిమా 30 రోజులు థియేటర్లలో కనిపించడమే వండర్. అలాంటిది ఇప్పటికే 50 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్ చిత్రం .. నేటితో 100 రోజుల థియేట్రికల్ రన్ తో సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పెషల్ పోస్ట్ పెట్టారు. "ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. హనుమాన్ థియేటర్స్ లో వంద రోజుల వేడుకలు జరుపుకోవడం నా లైఫ్ టైం ఆరాధించే క్షణం. ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో వంద రోజులు కంప్లీట్ చేసుకోవ‌డం అనేది చాలా అరుదు. ఈ మైలురాయిని హనుమాన్ చిత్రానికి అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అలాగే ఎల్లప్పుడూ నా వెంటే ఉండి నాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు, చిత్ర బృందానికి కృతజ్ఞతలు అని తెలిపారు."

కొన్ని రోజుల క్రితం 300 థియేటర్లలో 30 రోజులు ఆడి సరికొత్త చరిత్రతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన హనుమాన్ ఇప్పుడు శతదినోత్సవం పూర్తి చేసుకుంది. అప్పుడెప్పుడో.. చూసిన వంద రోజుల సినిమా ఫీట్ హనుమాన్ సాధించాడు.

Also Read: Actor Thiruveer: పెళ్లి పీటలు ఎక్కిన ‘మసూద’ న‌టుడు.. వైరలవుతున్న ఫొటోలు..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు