Director Krish on Radisson Hotel Drugs Case:హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నుంచి ప్రముఖంగా వినిపించిన పేరు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇతని మీద గచ్చిబౌలీ పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. కేసులో నిందితుడిగా పేరును కూడా చేర్చారు. అయితే ముందు తాను రాడిసన్ హోటల్‌లో అరగంట పాటూ ఉన్నాని ఒప్పుకున్నారు క్రిష్. విచారణకు హాజరు కావాలని చెప్తే ఒప్పుకున్నారు కూడా. శుక్రవారం అంటే ఈరోజు వస్తానని చెప్పారు. కానీ మళ్ళీ సోమవారం హాజరవుతానని పోలీసులతో చెప్పారు.
బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న క్రిష్..
సోమవారం లోపు కేసులో అరెస్ట్ అవకుండా బెయిల్ కోసం ప్రయత్నించారు క్రిష్. దీని మీద ఈ రోజు హైకోర్టులో విచారణ కూడా జరిగింది. అయితే ఈ విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో క్రిష్ ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. డ్రగ్స్ పార్టీతో తనకెలాంటి సంబంధాలు లేవని..తాను డ్రగ్స్ తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్రిష్ అంటున్నారు. ఈకేసులో తనను కావాలనే ఇరికించారని చెబుతున్నారు.
వివేకానంద స్టేట్‌మెంట్...
అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వివేకానంద (Vivekananda) స్టేట్‌మెంట్ ఆధారంగానే క్రిష్ పేరును పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. తరువాత వివేకానందకు, క్రిష్‌కు ఏ స్థాయిలో సంబంధాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటూ క్రిష్ బ్లడ్ శాంపిల్స్‌ను తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు.
విదేశాలకు పారిపోయిన నిందితులు..
మరోవైపు హైదరాబాద్ గచ్చిబౌలీ పోలీసులకు హోటల్ రాడిసన్ డ్రగ్స్ కేసు(Radisson Drugs Case) పెద్ద సవాల్‌గా తయారయింది. ఈ కేసులో పదిమంది వీఐపీలతో పాటూ డైరెక్టర్ క్రిష్(Director Krish) కూడా నిందితుడిగా అనుమానిస్తూ కేసు నమోదు చేశారు. కానీ ఇందులో ముఖ్య నిందితులు అయిన ఏ9గా ఉన్న నీల్ మాత్రం నాలుగు రోజులుగా పోలీసులకు చిక్కడం లేదు. ఇతని ఆచూకీ కోసం ప్రయత్నించగా విదేశాలకు జంప్ అయినట్లు తెలసింది. దాంతో పాటూ యూట్యూబర్ లిషి(Youtuber Lishi) కనిపించడం లేదని ఆమె సిస్టరే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో ట్విస్ట్. ఇక ఇదే కేసులో నిందుతుగా ఉన్న సందీప్, శ్వేతలు కూడా పరారీలోనే ఉన్నారు.