Dinesh Karthik: డీకే కు బంపర్ ఆఫర్.. బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌ గా బాధ్యతలు!

దినేశ్‌ కార్తిక్‌ ఆర్సీబీలోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఐపీఎల్‌ సీజన్‌ 2025 నుంచి బెంగళూరు జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. 'మా వికెట్‌ కీపర్‌కు ఘన స్వాగతం. దినేశ్ కార్తీక్ సరికొత్త అవతారంతో ఆర్సీబీకి తిరిగివచ్చాడు' అంటూ ఆర్సీబీ అధికారిక పోస్ట్ పెట్టింది.

Dinesh Karthik: డీకే కు బంపర్ ఆఫర్.. బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌ గా బాధ్యతలు!
New Update

DK As Batting Coach and Mentor: భారత స్టార్ క్రికెటర్ దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) మరోసారి క్రికెట్ ఫ్యాన్స్ ను అలరించనున్నాడు. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) డీకేకు కీలక బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ (IPL 2025) నుంచి బెంగళూరు జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌గా నియమించింది. ఈ విషయాన్ని ఆర్సీబీ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసింది. 'మా వికెట్‌ కీపర్‌కు ఘన స్వాగతం. దినేశ్ కార్తీక్ సరికొత్త అవతారంతో ఆర్సీబీకి తిరిగివచ్చాడు. డీకే ఆర్సీబీ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌, మెంటార్‌గా వ్యవహరిస్తాడు. క్రికెట్ నుంచి అతడిని వేరు చేయొచ్చు. కానీ, క్రికెట్‌ అతడికి దూరం కాదు' అంటూ ఆర్సీబీ ఎక్స్‌ లో పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. డీకే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

ఐపీఎల్‌లో బెంగళూరుతో పాటు కోల్‌కతా, ముంబై ఇండియన్స్, గుజరాత్‌ లయన్స్‌ జట్లకు ప్రాతినిధ్యం వహించిన డీకే.. 2024 ఐపీఎల్‌ సీజన్‌ లో రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఐపీఎల్‌లో మొత్తం 257 మ్యాచ్‌లాడి 4,842 పరుగులు సాధించాడు. అలాగే అన్ని రకాల టీ20 ఫార్మాట్ కు సైతం ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు కార్తిక్.

Also Read: IVFతో కవలలు పుట్టే అవకాశాలను ఇలా పెంచుకోండి.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

#ipl-2025 #dinesh-karthik #rcb
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe