ఎన్నికల దెబ్బకు పెళ్లి బాజాలు మోగే ఇళ్లల్లో ఆందోళన..ఎందుకంటే..!! ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెళ్లిల్లు కుదుర్చుకున్న ఇళ్లల్లో కష్టాలను కొని తెస్తున్నాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ మరోవైపు ఎన్నికల వేడి ప్రారంభం అయిపోయింది. దీంతో పెళ్లిళ్లు జరగాల్సిన ఇళ్లల్లో ఆందోళన మొదలైంది. ఎందుకంటే షాపింగ్ కోసం నగదు తీసుకెళ్తుంటే పోలీసులు తనిఖీల పేరుతో డబ్బును స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో వ్యాపారులు, అలాగే సామాన్యులు లబోదిబో మంటున్నారు. By Bhoomi 26 Oct 2023 in తెలంగాణ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి నవంబరు మాసంలో 19 నుంచి 24 తేదీల మధ్య మంచి ముహూర్తాలు ఉండటంతో వేలాది జంటలు ఒక్కటి కానున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వేలాది వివాహాలు జరిగే వీలుందని పురోహితులు చెప్తున్నారు. అయితే ఎన్నికల పుణ్యమా అని వివాహ వేడుకలు భయం భయంగా జరుపుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటిక నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. రూ.50 వేలకు మించి నగదు దొరికితే చాలు వెంటనే సీజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే వ్యాపారులు తమ రోజు వారీ కార్యకలాపాలకు వినియోగించాల్సిన నగదు సీజ్ అవుతుండటంతో వారంతా లబోదిబో అంటున్నారు. ముఖ్యంగా నగల వ్యాపారులు, వస్త్ర వ్యాపారులు తమ క్యాష్ ను బ్యాంకుకు చేరవేసే లోపే పోలీసులు సీజ్ చేస్తున్న సందర్భం కనిపిస్తోంది. సీజ్ చేసిన సొమ్మును ఆధారాలు చూపితేనే తిరిగి ఇస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఇదంతా చాలా సమయం తీసుకుంటుందని వ్యాపారస్తులు లబో దిబో అంటున్నారు. ముఖ్యంగా పెళ్లిల్లు నేటి రోజుల్లో ఎంతో ఖర్చుతో కూడుకున్నవిగా తయారు అయ్యాయి. కేవలం. దుస్తులు, బంగారం, పెళ్లి ఏర్పాట్లకు లక్షల్లో ఖర్చు అవుతోంది. మంగళసూత్రం కొనాలన్నా దాదాపు లక్షకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది కూడా చదవండి: బెదిరింపులకు భయపడేదే లేదు.. సీఐడీకి నారా భువనేశ్వరి సవాల్.. ఎన్నికల కోడ్ వల్ల రూ.50 వేల కన్నా మించి నగదును తీసుకుపోలేని పరిస్థితి ఏర్పడింది. అయితే కనీసం లక్ష రూపాయలు లేనిదే పెళ్లి బట్టలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల కోడ్ వల్ల పెళ్లి ఖర్చుల కోసం చెక్కు బుక్కులు వెంటపెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొందరు వాపోతున్నారు. అయితే లక్షకు మించి డిజిటల్ లావాదేవీలు జరపడం సాధ్యం కావడం లేదు దీంతో డిజిటల్ ట్రాన్సక్షన్స్ కూడా పనిచేయని పరిస్థితి ఏర్పడింది. అయితే పోలీసుల తనిఖీల్లో పట్టుకున్న సొమ్మును విడిపించుకునేందుకు చాలా రోజులు పడుతోందని వ్యాపారులు వాపోతున్నారు. పెళ్లి పనులు పెట్టుకొని అధికారుల చుట్టూ తిరగాలా? నగదును స్వాధీనం చేసుకున్న తర్వాత సరైన ఆధారాలు చూపిస్తేనే డబ్బును తిరిగిస్తామని పోలీసులు చెప్తున్నారు. కానీ, ఇంట్లో పెళ్లి వేడుకుల పెట్టుకొని ఎనికల అధికారుల చుట్టూ తిరగడం అసాధ్యమని వాపోతున్నారు.అయితే పెళ్లి షాపింగుకు వెళ్లేవారు పెళ్లికార్డు చూపించాలని అధికారులు చెబుతున్నారు. చిన్నచిన్న పట్టణాల్లో బంగారం, వస్త్ర వ్యాపారాలు చేసే వారిని పోలీసులు తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని వాపోతున్నారు. యూపీఐలోనూ సమస్యలు: యూపీఐ లావాదేవీల్లో సైతం సమస్యలు తలెత్తుతున్నాయని చాలా మంది వ్యాపారులు చెబుతున్నారు. ఇటీవల ఎస్బీఐ యూపీఐ మూడు రోజుల పాటు పనిచేయలేదు. దీంతో జిల్లాల్లో చాలా నగదుకు డిమాండ్ పెరిగి సామాన్యులు ఇబ్బందుల పాలయ్యారు. ఇక పెట్రోల్ బంకులు, గ్యాస్ ఏజెన్సీలు, మద్యం షాపులు, హోల్ సేల్ బిజినెస్ లలో రోజూ లక్షల రూపాయల నగదు చేతులు మారుతూ ఉంటాయి. ఈ సొమ్మును తనిఖీల్లో భాగంగా అధికారులు పట్టుకోవడంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. అయితే పోలీసులు చేస్తున్నా అతిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌కు ఫిర్యాదు కూడా చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇండియన్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సచిన్ ఫ్రెండ్ ఘన విజయం! #telangana-elections #marriages #ts-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి