Rishab Setty: నేను అలా అనలేదు..క్లారిటీ ఇచ్చిన కాంతారా హీరో!

ఇఫ్ఫీ వేడుకల సమయంలో కాంతార నటుడు రిషబ్‌ శెట్టి చేసిన వ్యాఖ్యలు రష్మికని ఉద్దేశించి చేసినవే అన్నట్లు ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా..అది నిజం కాదని రిషబ్‌ శెట్టి క్లారిటీ ఇచ్చారు.

New Update
Rishab Setty: నేను అలా అనలేదు..క్లారిటీ ఇచ్చిన కాంతారా హీరో!

కాంతార (Kantara) సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్నాడు నటుడు రిషబ్‌ శెట్టి (Rishab setty). ఆయన గతవారం జరిగిన ఇఫ్ఫీ వేడుకల కార్యక్రమంలో నటి రష్మిక (Rashmika) మందన్న గురించి తప్పుగా మాట్లాడారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆరోజు రిషబ్‌ అసలేం మాట్లాడారంటే...'' ఒక్క హిట్‌ రాగానే కన్నడ చిత్ర పరిశ్రమను విడిచిపెట్టాలని అనుకోవడం లేదు.

ఈ విషయం గురించి గతంలో రష్మిక పై చాలా మంది ఫైర్‌ అయ్యారు. కన్నడలో కెరీర్‌ ను మొదలు పెట్టిన ఆమె....ఇప్పుడు కన్నడలో తప్ప అన్ని భాషల్లో నటిస్తుందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా లో పీకాక్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆ సందర్భంలో ఆయన కన్నడ పరిశ్రమను విడిచిపెట్టాలని అనుకోవడం లేదని వ్యాఖ్యానించారు. కాంతారా సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి కన్నడ ప్రజలే ముఖ్య కారణమని వివరించారు.వారి వల్లే ఈ చిత్రం ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా ఘన విజయాన్ని సాధించిందని తెలిపారు.

కన్నడ ప్రజల పట్ల ఎప్పుడూ కూడా కృతఙత తో ఉంటానని వివరించారు. ఒక్క హిట్‌ అందుకోగానే కన్నడ పరిశ్రమను విడిచిపెట్టే వ్యక్తిని కాను అని ఆయన వివరించారు. ఈ క్రమంలో నే సోషల్‌ మీడియా యూజర్‌ ఒకరు ఇది కచ్చితంగా రష్మికను ఎత్తి చూపడమే అని ఆరోపించారు. అయితే రిషబ్‌ అన్న మాటలకు అర్థం అది కాదని తెలుసుకున్న అతను సోషల్‌ మీడియా వేదికగానే రిషబ్‌ కి క్షమాపణలు చెప్పాడు.

నాకు అర్థం అయ్యింది ఒకలా..కానీ ఆయన అన్నది ఒకలా..రెండింటికి చాలా తేడా ఉందని అని అతను వివరించాడు. దానికి , దీనికి చాలా తేడా ఉందని అతను పేర్కొన్నాడు. దానికి రిషబ్‌ రిప్లై ఇస్తూ '' పర్వాలేదు..నేను ఏం చెప్పాలనుకున్నానో కనీసం కొందరైనా అర్థం చేసుకున్నారని '' సోషల్‌ మీడియాలో రాసుకోచ్చారు. కొంతకాలం ముందు రిషబ్, రష్మిక ఒకరిపై ఒకరు పరోక్షంగా వ్యాఖ్యలు చేసుకోవడంతో వార్తల్లో నిలిచారు.

also read: ముంచుకొస్తున్న మిచౌంగ్‌..హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

Advertisment
తాజా కథనాలు