తెలంగాణలో దళిత బంధు అమలుపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ఆ పథకానికి ఎంపికై నిధులొచ్చిన వారిలో కూడా అనుమానాలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం లభించింది. మొత్తం 11,108 మందికి గులాబి పార్టీ దళిత బంధు సాయం చేసింది. ఇందుకోసం లబ్ధిదారుల ఖాతాల్లో రూ.436 కోట్లు వేసింది. అయితే ఇప్పుడు ఇందుకు సంబంధించిన నిధుల్ని ఉపసంహరించుకునే పరిస్థితి లేదు.
Also Read: పశ్చిమ బెంగాల్‌లో దారుణం.. సాధువులను చితకబాదిన స్థానికులు..
అంతేకాదు రెండో దఫాలో నియోజకవర్గానికి 1100 మంది చొప్పున మొత్తం లక్షా 31 వేల మందిని గుర్తించారు. ఇందుకోసం వీరికి రూ.749 కోట్లు ఇచ్చేందుకు ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ పథకంపై అర్హులకు సాయంపైనా క్లారిటీ లేదు. అయితే ఇప్పటి వరకు లబ్ధిదారులకు వచ్చిన రూ.436 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీజ్ చేస్తుందా.. ఇక దళిత బంధు లేనట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: నగరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్..విదేశీయుల సందడి