Diabetes: ఇలా చేస్తే షుగర్ రమ్మన్నా రాదట..!!

ఈ రోజుల్లో మధుమేహం వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధి కనిపించకముందే దాని గురించి తెలుసుకోవడం మంచిది. ఈ వ్యాధి ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్నికంట్రోల్లో ఉంచుకోవడమే పరిష్కారం. జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే షుగర్ మన జోలికి రాదంటున్నారు హెల్త్ ఎక్స్‎పర్ట్స్.

Diabetes: ఇలా చేస్తే షుగర్ రమ్మన్నా రాదట..!!
New Update

నేటికాలంలో చాలామందిని వేధిస్తోన్న సమస్య డయాబెటిస్. వయస్సుతో సంబంధం లేకుండా పదిమందిలో నలుగురిని పలుకరిస్తుంది. దీనికి కారణం మనజీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. షుగర్ ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే అసలైన పరిష్కారం. ఒకసారి షుగర్ అటాక్ చేసిందంటే... మన మిగిలిన జీవిత చిత్రం మొత్తం మారిపోతుంది. మనిషికి కావలసిన ఆహారపదార్థాలు తేలికగా తినగలిగే ఆ రోజులు రానున్న రోజుల్లో కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఆహారం కూడా కొలిచి తినే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

మధుమేహం సైలెంట్ కిల్లర్ వ్యాధి:
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, కొన్నిసార్లు మధుమేహం లక్షణాలు విపరీతంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి ప్రాణం తీయగలిగే పరిస్థితి ఎదురవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఒక్క వ్యక్తి జీవితం పూర్తిగా మారిపోతుంది. ప్రతివిషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందుకే ఈ వ్యాధి మనలో రాకముందే మేల్కోవాలి!

ఇది కూడా చదవండి: ఈ లక్షణాలను విస్మరించకండి…ప్రాణాంతక వ్యాధులకు కారణం కావొచ్చు..!!

మధుమేహం వస్తే, ఏమి జరుగుతుంది?
మధుమేహం సోకిన తర్వాత, శరీరం అవసరమైన మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోతుంది. ఇక్కడే సమస్యలు కనిపిస్తాయి. ఎందుకంటే మనం తినే ఆహారంలో చక్కెర మొత్తాన్ని శక్తిగా మార్చడానికి ఇన్సులిన్ చాలా అవసరం. ఈ ప్రక్రియ తప్పుగా ఉంటే, మానవ రక్తంలోని చక్కెర చివరికి శరీర అవయవాలను దెబ్బతీస్తుంది.

శారీరక శ్రమ:
శారీరక శ్రమ అంటే మనం ఇంటి లోపల చేసే పనులు లేదా ఆఫీసు చుట్టూ తిరగడం కాదు! శారీరక శ్రమ అంటే రోజువారీ వ్యాయామం, చురుకైన నడక, జాగింగ్, యోగా సాధన.
వారానికి 150 నిమిషాలు చురుకైన నడక, జాగింగ్, బ్యాడ్మింటన్ ఆడటం వంటి మితమైన, తీవ్రమైన వ్యాయామం. అదనంగా, ఒక వారంలో 75 నిమిషాల పాటు తీవ్రమైన వ్యాయామం చేయవచ్చు.

శరీర బరువులో సమతుల్యతను కాపాడుకోండి:
అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి కారణంగా శరీర బరువును పెంచుకున్న వారికి భవిష్యత్తులో దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వు పదార్ధాలను నివారించండి. ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాలను చేర్చండి. అనారోగ్యకరమైన ఆహారానికి బదులు ఇలాంటి ఆహారాన్ని తీసుకుంటే మన రోజువారీ ఆహారంలో మధుమేహంతో పాటు ఇతర వ్యాధులు కూడా దూరమవుతాయి.

ఇది కూడా చదవండి: రేవంత్ తీరుతో కాంగ్రెస్‎కు నష్టం..సోనియా, రాహుల్‎కు గోనె ప్రకాష్ సంచలన లేఖలు..!!

ఆరోగ్య పరీక్ష చేయించుకోండి:
సంవత్సరానికి రెండుసార్లు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇది ప్రమాదకరమైన ఆరోగ్య పరిస్థితులు, ప్రాణాంతక వ్యాధుల ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో సహాయపడుతుంది.ముఖ్యంగా కుటుంబ చరిత్రలో మధుమేహం ఉన్నట్లయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.ఎందుకంటే ఈ వ్యాధి జన్యుపరంగా కనిపించే అవకాశం ఉంది. దీనిపై మీ వైద్యునితో చర్చించి తగిన జాగ్రత్తలు తీసుకోండి.

#diabetes #diabetes-patients #diabetes-symptoms #diabetes-control-diet
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe