Dhruv Rathee On PM Modi: మోదీ పిరికివాడు, నియంత..యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సెన్సేషనల్ కామెంట్స్

ప్రధాని మోదీ అంత పిరికివాడు ఇంకొరు ఉండరు అని అంటున్నారు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ. అంతేకాదు పెద్ద నియంత అని కూడా కామెంట్ చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ చేసిన ఇంటర్వ్యూలో ధ్రువ్ ఈ కామెంట్స్ చేశారు.

New Update
Dhruv Rathee On PM Modi: మోదీ పిరికివాడు, నియంత..యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సెన్సేషనల్ కామెంట్స్

Dhruv Rathee On PM Modi: ధ్రువ్ రాఠీ..ప్రముఖ యూట్యేర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్. అందరూ చేసే వీడియోల్లాంటివి ఇతను చేయడు. ధ్రువ్ సోషల్, పబ్లిక్ ఇంట్రస్ట్ విషయాలు, రాజకీయాలు, నేతలు ఇలాంటివి వాటికి సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడతాడు. భారతదేశం, ఇతర ముఖ్య దేశాల గురించి కూడా కామెంట్స్ చేస్తుంటాడు. ధ్రువ్ చెప్పేది ఎంతటి బిగ్ సాట్ అయినా అస్సలు మొహమాటపడడు. ప్రధాన మోదీనే కోవార్డ్ అంటూ కామెంట్ చేశాడు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు కూడా దాన్ని వ్యతిరేకిస్తూ చాలా స్ట్రాంగ్ వీడియో చేశాడు. ఈ యూట్యూబర్‌ను తాజాగా ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ప్రధాని మోదీ గురించి ధ్రువ్ రాఠీ సంచలన కామెంట్స్ చేశారు.

ప్రధాని మోదీ ఒక నియంత, పిరికిపంద అంటున్నారు ధ్రువ్ రాఠీ. దేశంలో జరుగుతున్న అన్యాయాలు చూస్తే ఈ విషయం అర్ధమవుతుందని చెబుతున్నారు. మోదీ పాలనలోకి వచ్చినప్పటి దగ్గర నుంచీ ఇప్పటి వరకు ఏ దేశంలో జరగనవన్నీ మన దేశంలో జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. మన దేశం నియంత పాలనలోకి జారుకుంటోందని కామెంట్ చేశారు. దానికి ఉదాహరణగా 2014 నుంచి 2019 మధ్యలో జర్నలిస్ట్‌ల మీద జరిగిన అటాక్‌లను చెప్పుకోవచ్చని చెబుతున్నారు. ఆ నాలుగేళ్ళల్లో 198 మంది జర్నలిస్ట్‌ల మీద అటాక్ జరిగితే అందులో 40 మందిని చంపేశారని లెక్కలతో సహా చెప్పారు. ఇదొక్క విషయం చాలు మోదీ ఏంత నియంతో చెప్పడానికి అంటూ కుండ బద్ధలు కొట్టినట్టు మాట్లాడారు.

కానీ ఇంత జరుగుతున్ని ఎందుకు భారతదేశ ప్రజలు మోదీనే మళ్ళీ కావాలనుకుంటున్నారని సర్వే ల్లో వస్తుంది అన్న ప్రశ్నకు సమాధానంగా...ధ్రువ్ ఇలా చెప్పుకొచ్చారు. ఈ సర్వేలను అస్సలు నమ్మకూడదు అంటూ చెబుతున్నారు. సర్వేల్లో మనం అడిగిన ప్రశ్నలబట్టి జవాబులు వస్తాయి. దేశంలో చాలా 70 పర్శంట్ జన్ మోదీకి వ్యతిరేకంగా ఉ్నారు. కానీ సర్వేల్లో ఆ విషయం ఎక్కడా కనిపించదు. ఎందుకంటే వారు అడిగిన ప్రశ్నలు అలానే ఉంటాయి అని అంటున్నారు. దేశాన్ని మోదీ నుంచి, నియంతృత్వం నుంచి కాపాడాలంటే ఒక్కటే ఒక్క ఆయుధం ఉందని...అదే ఓటు హక్కు అని చెబుతున్నారు. ఈసారి అయినా ప్రజలు బీజేపీ, మోదీకి వ్యతిరేకంగా ఓటు వేసి తమ వ్యతిరేకతను చాటాలని ధ్రువ్ చెబుతున్నాడు. ఇలానే దేశం ఉంటే చాలా అన్యాయాలు జరుగుతాయని చెబుతున్నారు.

Also Read:డీఎంకే తమిళనాడును లూటీ చేస్తున్న ఓ కంపెనీ.. పీఎం మోదీ సెన్షేషనల్ కామెంట్స్!

Advertisment
Advertisment
తాజా కథనాలు