Bank Fraud : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌!

బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్ ధీరజ్‌ వాధవన్‌ ను సీబీఐ మంగళవారం అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

New Update
Bank Fraud : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్‌ అరెస్ట్‌!

DHFL Director Arrest : బ్యాంకును మోసం చేసిన కేసులో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌(DHFL) డైరెక్టర్ ధీరజ్‌ వాధవన్‌(Dheeraj Wadhawan) ను సీబీఐ(CBI) మంగళవారం అరెస్ట్‌ చేసింది. అనంతరం ఆయనని కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిందితుడు ధీరజ్‌ రూ. 34,000 కోట్ల బ్యాంకు మోసం కేసులో గతంలోనే అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ధీరజ్‌ 2022, డిసెంబర్‌లో డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయింది. సీబీఐ ఛార్జిషీట్ అసంపూర్తి ఉందన్న ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది.

తాజాగా ధీరజ్ వాధవన్‌ను సీబీఐ సోమవారం రాత్రి ముంబై(Mumbai)లో అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేసింది. అనంతరం ఢిల్లీ కోర్టు(Delhi Court) లో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియం ఇచ్చిన ఫిర్యాదుపై 2022, జూన్‌లో సీబీఐ అరెస్ట్ చేసింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో ధీరజ్‌ను అరెస్ట్ చేసింది. నిధులను స్వాహా చేసేందుకు అనేక షెల్ కంపెనీలను సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే లావాదేవీలను దాచడానికి పుస్తకాలను తప్పుగా మార్చినట్లుగా అధికారులు గుర్తించారు.

తాజాగా ధీరజ్, అతని సోదరులకు లభించిన డిఫాల్ట్ బెయిల్ రద్దు కావడంతో వారిని సీబీఐ అరెస్ట్ చేసింది. 2023, డిసెంబర్ 8న యెస్ బ్యాంక్ కేసులో ఆరోగ్య కారణాలతో ధీరజ్ మధ్యంతర బెయిల్ పొందారు. బాంబే హైకోర్టు ఈ మధ్యంతర బెయిల్‌ను మే 2న సాధారణ బెయిల్‌గా మార్చింది.

Also read: శుభవార్త చెప్పిన ఐఎండీ..జూన్‌ ఒకటినే కేరళకు వస్తున్న రుతుపవనాలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు