MLC Kavitha: మజాక్‌ చేస్తే తాట తీస్తా

నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె.. ఉమ్మడి జిల్లాలో రింగ్‌ రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపూరి అర్వింద్‌పై ఫైర్‌ అయిన కవిత.. అర్వింద్‌ రైతులకు పసుపు బోర్డు తేకపోగా.. జిల్లాను అభివృద్ధి కూడా చేయలేకపోయారన్నారు.

New Update
MLC Kavitha: మజాక్‌ చేస్తే తాట తీస్తా

Dharmapuri Arvind-MLC Kavitha Fire-KCR potholes on national highways

నిజామాబాద్‌ జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. జిల్లాలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఆమె.. ఉమ్మడి జిల్లాలో రింగ్‌ రోడ్డు నిర్మాణం ఇంతవరకు పూర్తికాకపోవడంతో ఎమ్మెల్సీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధర్మపూరి అర్వింద్‌పై ఫైర్‌ అయిన కవిత.. అర్వింద్‌ రైతులకు పసుపు బోర్డు తేకపోగా.. జిల్లాను అభివృద్ధి కూడా చేయలేకపోయారన్నారు. జిల్లా అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు తనకు ఇచ్చినట్లు ఎంపీ అసత్య ప్రచారం చేస్తున్నారన్న కవితా.. ఎంపీ 24 గంటల్లో తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలన్నారు. లేదంటే పులాంగ్‌ చౌరస్తాలో ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు అర్వింద్ తన తండ్రిపై విమర్శలు చేస్తే వదిలేశామన్న కవిత.. ఇప్పుడు తన భర్తపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన భర్త జోలికి వస్తే చూస్తూ ఊరుకోమని మజాక్‌ చేస్తే తాట తీస్తామని కవిత హెచ్చరించారు. రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తెస్తున్నారని ఆమె ప్రశ్నించారు. చౌకాబారు రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో అర్వింద్ ఎక్కడ నుంచి పోటీ చేసినా ఆయనను ఓడించి బీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తామన్నారు. మణీపూర్‌లో చెలరేగుతున్న హింస, యువతులపై జరిగిన దాడి గురించి బీజేపీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం రైతు బంధు పథకానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కవిత వెళ్లడించారు. ఎస్‌ఆరెస్పీ పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో బీజేపీది ఒక్క రూపాయి కాంట్రిబ్యూషన్ లేదని, రాష్ట్రంలోని జాతీయ రహదారులు గుంతలమయమయ్యాయన్నారు. జాతీయ రహదారులపై గుంతలు ఏర్పడితే ఎంపీ గడ్డి పీకుతున్నాడా అని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో ఎంపీని నిలదీస్తామని కవిత స్పష్టం చేశారు. కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారో చెప్పాలన్నారు. అబద్ధాల మీద సమాజం నడవదని సూచించారు.

Advertisment
తాజా కథనాలు