Dhanush : అవును మేమిద్దరం విడిపోతున్నాం.. స్టార్‌ హీరో అధికారిక ప్రకటన!

తాజాగా నటుడు ధనుష్‌ తన విడాకులు (Divorce)  గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపాడు.చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నట్లు సమాచారం.

New Update
dhanush divorce

Divorce : సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌(Rajinikanth) పెద్ద కూతురు ఐశ్వర్య(Aishwarya) రజినీకాంత్‌, కోలీవుడ్‌ స్టార్‌ నటుడు ధనుష్‌(Dhanush)  2004 లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల పాటు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలతలు రావడంతో గత రెండు సంవత్సరాలుగా ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. అప్పటి నుంచి కూడా వీరు విడాకులు తీసుకుంటున్నారు అని అభిమానులు అంటున్నప్పటికీ వారు మాత్రం నోరు విప్పలేదు.

తాజాగా నటుడు ధనుష్‌ తన విడాకులు  గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో ఎంతో కాలంగా వీరిద్దరూ మళ్లీ కలుస్తారు అని అనుకుంటున్న అభిమానులు నిరాశకు గురైయ్యారు. ఐశ్వర్య డైరెక్ట్‌ చేసిన రెండు సినిమాల్లో ధనుష్‌ నటించాడు.

ఆ సమయంలోనే వారి మధ్య ప్రేమ చిగురించి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా వారు విడిగా ఉంటున్నప్పటికీ పిల్లల కోసం వారు ప్రతి సందర్భంలోనూ కలుస్తునే ఉన్నారు. దీంతో అభిమానులంతా... వాళ్లిద్దరూ మళ్లీ కలుస్తారనే ఆశపడ్డారు.

కానీ ధనుష్‌ చేసిన ప్రకటనతో ఇక వారు ఎప్పటికీ కలవలేరు అని తెలిసిపోయింది. చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టు(Family Welfare Court) లో విడాకులకు అప్లై చేసుకున్నట్లు సమాచారం.

Also read: అఖిల్‌ పై సమంత పోస్ట్‌.. ఆనందంలో అభిమానులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు