Telangana: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు సస్పెండ్..

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో నిందితులైన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావులను రాష్ట్ర పోలీసు శాఖ సస్పెండ్‌ చేసింది. ఇందుకు సంబంధించి డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభాకర్‌ రావుతో కలిసి వీళ్లు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

New Update
Telangana: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇద్దరు అడిషనల్‌ ఎస్పీలు సస్పెండ్..

ఫోన్‌ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై రాష్ట్ర పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఈ కేసులో నిందితులైన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావు సస్పెండ్‌ చేసింది. ఇందుకు సంబంధించి డీజీపీ రవిగుప్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఈ ఇద్దరు పోలీసులని కస్టడిలోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. ప్రభాకర్‌ రావుతో కలిసి వీళ్లు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి.

Also read: ఆ మంత్రే షిండే.. ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అడిషనల్‌ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న.. వీళ్లందరూ పలువురు ప్రముఖుల ఫోన్లపై నిఘా పెట్టినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వంలో టాస్క్‌ఫోర్స్‌ను తన గుప్పిట్లో ఉంచుకున్న రాధాకిషన్‌రావు.. సిబ్బందిని అనధికారిక కార్యకలాపాల కోసం వాడుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈయన గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

అంతేకాదు ఆ పార్టీకి ఆర్థిక వనరుల అందించడం కోసం ఎస్‌ఐబీ బృందాన్ని రంగంలోకి దింపినట్లు సమాచారం. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మారాక కాంగ్రెస్ రావడంతో ఇందుకు సంబంధించిన ఆధారాలను ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ధ్వంసం చేశారు. దీంతో ఈ వ్యవహారానికి సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

Also Read: కేసీఆర్‌, కేటీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు