Devara Movie Update: గ్లామర్ తగ్గని ప్రియమణి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా నటిస్తుందా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా హీరోయిన్ ప్రియమణి నటించనుంది అన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రియమణి ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 'యమదొంగ'లో ఎన్టీఆర్ సరసన ప్రియమణి నటించింది. ఇంకా ఏమాత్రం గ్లామర్ తగ్గని ప్రియమణి ఎన్టీఆర్‌ కు తల్లి పాత్రను పోషించడమేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
Devara Movie Update: గ్లామర్ తగ్గని ప్రియమణి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తల్లిగా నటిస్తుందా..?

Devara Movie Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) ఆర్ ఆర్ ఆర్(RRR) సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా విజయం తర్వాత ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా కోసం ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రమే కాకుండా నందమూరీ అభిమానులు సైతం ఎంతోగానో ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే దేవర మూవీలో జూనియర్ ఎన్టీఆర్ కు తల్లిగా టాలీవుడ్ హీరోయిన్ ప్రియమణి(Priyamani నటిస్తోంది అంటూ నెటిజన్స్ హల్ చల్ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. జూనియర్ పాత్రకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(janvi kapoor) నటిస్తుండగా.. తండ్రీ పాత్రకి జోడీగా ప్రియమణి నటించబోతుంది అన్న వార్త నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.

publive-image

అయితే, ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియదు కానీ ప్రియమణి ఫ్యాన్స్ మాత్రం చాలా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రం 'యమదొంగ'లో ఎన్టీఆర్ కు జోడీగా ప్రియమణి నటించింది. ఇంకా ఏమాత్రం గ్లామర్ తగ్గని ప్రియమణి ఎన్టీఆర్‌ కు తల్లి పాత్రను పోషించడమేంటని ప్రియమణి ఫాన్స్ హర్ట్ అవుతున్నారు.

publive-image

దేవర సినిమాలో సేఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్, జాన్వి కపూర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: తమిళ్ హీరో వేధించాడు..! నిత్యమీనన్ సీరియస్..!!

Advertisment
తాజా కథనాలు