BJP Manifesto: మహిళలు, యువతే లక్ష్యంగా బీజేపీ సంకల్ప పత్ర

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ అన్ని రకాలుగా సంసిద్ధమవుతోంది. ఇప్పటికే అభ్యర్ధులను ఖరారు చేసేశారు. ఇప్పుడు ఈరోజు మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. సంకల్ప పత్ర పేరుతో బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో వారి ఆశయాలను నెరవేరుస్తుందా..దీంట్లో ప్రజలకు ఏమిచ్చారు.కింది ఆర్టికల్‌లో చదవండి.

BJP Manifesto: మహిళలు, యువతే లక్ష్యంగా బీజేపీ సంకల్ప పత్ర
New Update

BJP Manifesto 2024: మూడవసారి కూడా అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ గట్టి సంకల్పంతో ఉంది. దానికి ప్రతిబింబంగానే తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. అందుకే దానికి సంకల్ప పత్ర (Sankalp Patra) అని పేరు కూడా పెట్టింది. తన మేనిఫెస్టో కోసం బీజేపీ చాలా కసరత్తులే చేసింది. దీని కోసం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) నేతృత్వంలోని 27 మంది సభ్యులతో మేనిఫెస్టో కమిటీని నియమించింది.దీని కోసం అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుంది. రెండు, మూడుసార్లు కమిటీ సమావేశం అయింది. ఎన్నికలకు ముందే మేనిఫెస్టోతోనే భారత ప్రజల మనసును గెలుచుకోవాలని అనుకుంటోంది బీజేపీ. ఇందులో గత రెండేళ్ళ పాలనలో ఏం చేశారో చెబుతూను ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు.

బీజేపీ అధినేతలు విడుదల చేసిన సంకల్ప పత్రలో 14 అంశాలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్ళల్లో తాము దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టో ఆవిష్కరిస్తుంది బీజేపీ నేత జేపీ నడ్డా (JP Nadda) చెప్పారు. ఇప్పటివరకు మేము ఏది చెప్పామో అదే చేశాము. వచ్చే ఐదేళ్ళల్లో కూడా అదే చేస్తామని అంటున్నారు. అందుకు ఉదాహరణే త్రిపుల్‌ తలాక్‌ రద్దు, ఆర్టికల్‌ 370 రద్దు ,రామ మందిర నిర్మాణం ,నాలుగు కోట్ల పక్కా ఇళ్లు అని అంటున్నారు. మహిళలు, రైతులు, యువత, పేదలే అజెండాగా మేనిఫెస్టోను తయారు చేశామని చెబుతున్నారు బీజేపీ నేతలు.

14 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో

14 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో

1. విశ్వబంధు

2. సురక్షిత భారత్‌

3. సమృద్ధ భారత్‌

4. గ్లోబల్‌ మాన్యూఫ్యాక్చరింగ్‌ హబ్‌

5. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు

6. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌

7. సాంస్కృతిక వికాసం

8. గుడ్‌ గవర్నెన్స్‌

9. స్వస్థ భారత్

10. అత్యుత్తమ శిక్షణ

11. క్రీడావికాసం

12. సంతులిత అభివృద్ధి

13. సాంకేతిక వికాసం

14. సుస్థిర భారత్‌

మహిళలు, యువత అభివృద్ధే లక్ష్యంగా సంకల్ప పత్రను రూపొందించామని చెప్పారు ప్రధాని మోదీ (PM Modi). సబ్‌కా సాథ్..సబ్‌కా వికాస్‌ అనే దాన్ని నిజం చేసి చూపిస్తామని అంటున్నారు. గత పది ఏళ్ళల్లో చేసిన దానికన్నా మరింత ఎక్కువగా చేసి చూపిస్తామని తెలిపారు. ఇప్పటివరకు ప్రధాని ఆవాస యోజన పథకం కింద కొంత మాత్రమే ఇచ్చామని వచ్చే ఐదేళ్ళల్లో దీన్ని మరింత ఎక్కువ చేస్తామని చెప్పారు. దీంతో పాటూ మహిళల వికాసానికి విశేష కృషి చేస్తామని మేనిఫెస్టోలో రూపొందించారు. ఇప్పటివరకు దాదాపు 10 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుబంధం కలిగి ఉన్నారు. వచ్చే ఐదేళ్ళల్లో ఐటీ, విద్య, ఆరోగ్యం, రిటైల్, పర్యాటక రంగాలలో ఈ సవయం సహాయక బృందాలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు ప్రధాని మోదీ.

గత పదేళ్లలో దేశాభివృద్ధి కోసం ఎన్నో పనులు చేశాం, ఎన్నో నిర్ఆలు తీసుకున్నాం...ఎన్నో పథకాలను అమలులోకి తీసుకువచ్చాం. యువత, పేద, మహిళ వర్గాలపై ఎంతో దృష్టి పెట్టాం. పెద్ద సంఖ్యలో ఉద్యోగ కల్పన చేపట్టాం. ఇప్పుడు వచ్చే ఐదేళ్ళల్లో ఇది మరింత ఎక్కువ చేసేలా బీజేపీ సంకల్ప పత్రం ఉందని అన్నారు మోదీ. యవత ఆకాంక్షను తమ మేనిఫెస్టో (BJP Manifesto) ప్రతిబింబిస్తుందని తెలిపారు. మోదీ గ్యారెంటీ అంటే అది కచ్చితంగా పూరత్య్యే గ్యారెంటీ. 70 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్యం అందిస్తాం. పేదల జీవితాలు పూర్తిగా మార్చేస్తాం. ఇచ్చిన ప్రతీ హామీని బీజేపీ నెరవేరుస్తుంది. ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచుతాం. ముద్ర పథకం ద్వారా కోట్ల మందికి ఉపాధి దక్కింది. మహిళలను లక్షాధికారులుగా చేయడమే మా లక్ష్యం. వ్యవసాయంలో టెక్నాలజీని పోత్సహిస్తున్నాం..దీనిని మరింత ముందుకు తీసుకువెళతాం అని ప్రధాని వివరించారు.

Also Read: అవి హెల్త్ డ్రింక్స్ కాదా? నిజంగా ఇవి పిల్లలకు అవసరమా?

#lok-sabha-elections-2024 #bjp-manifesto #pm-modi #bjp
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe