Deputy CM Pawan Kalyan: తాను మాటల మంత్రిని కాదు చేతల మంత్రినని నిరూపించుకున్నారు ఆంధ్ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. ఒకపక్క సంబంధిత శాఖల అధికారులతో సమీక్షలు చేస్తూ, మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తూనే మరవైపు ప్రజల సమస్యల మీద కూడా దృష్టి పెట్టారు. నిన్న జనేసేన కార్యాలయానికి వచ్చిన ప్రజలతో స్వయంగా పవనే మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కార్యాలయానికి వినతులు తీసుకొని వచ్చిన బాధితులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి వారి నుంచి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి తగు హామీల ను ఇచ్చారు.
ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ నుంచి 1143 ఉపాధ్యాయ పోస్టులను మినహాయించాలని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది కోరారు. గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ విధానంలో తాము బోధనలో ఉన్నామని తెలిపారు. 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు వచ్చేలా చూడాలని, ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థకు కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ అని పేరు మార్చాలని మరి కొంతమంది అడిగారు. దాంతో పాటూ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీలోనే డ్రాయింగ్, క్రాఫ్ట్, మ్యూజిక్ ఉపాధ్యాయుల నియామకం కూడా చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నిరుద్యోగ ఉపాధ్యాయుల సంఘం కోరింది. 1986 నుంచి ఈ పోస్టులు భర్తీ చేయడం లేదని విన్నవించారు. వీరందరికీ డిప్యూటీ సీఎం పవన్ ప్రభుతవ పరంగా చేయగలిగింది అంతా చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు ప్రమాదవశాత్తు ఇళ్లు కాలిపోవడం వల్ల తన కుమార్తె సర్టిఫికెట్లతో పాటు ఆమె చదువుకోసం దాచిపెట్టిన డబ్బులు కాలిపోయాయని ముమ్మిడి మహేశ్వరి అనే మహిళ కన్నీరు పెట్టుకున్నారు. తమ కుమార్తెను చదువులకి సాయం అందించాలని కోరారు. అలాగే పలువురు దివ్యాంగులు తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ కార్యాలయానికి తరలివచ్చారు. వీరందరి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ వినతులు స్వీకరించారు. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Also Read:Rahul Gandhi: రానున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే విజయం-రాహుల్ గాంధీ