Pawan Kalyan: ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు!

జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.గెలిచింది 21 స్థానాలే అయినా కూటమికి వెన్నుముక అయ్యామని పవన్ గర్వంగా చెప్పుకొచ్చారు.

Pawan Kalyan: ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమం.. పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ కీలక సూచనలు!
New Update

Pawan Kalyan: జనసేన పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళగిరి (Mangalagiri) పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ రాజకీయ చరిత్రలో ఓ పార్టీ వందశాతం గెలుపు ఎక్కడా జరగలేదు. అది జనసేన పార్టీకి (Janasena Party) మాత్రమే సాధ్యమైంది. జనసేన గెలుపు పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నేను ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రతిఒక్కరూ నా వద్దకు వచ్చి నాతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారు.

ఇదంతా జనసైనికుల ఘనతే. జనసేన పార్టీకి తగిలిన దెబ్బలు చాలా ఉన్నాయి. అయినా తట్టుకొని నిలిచాం. గెలిచింది 21 స్థానాలే అయినా కూటమికి వెన్నుముక అయ్యామని పవన్ గర్వంగా చెప్పుకొచ్చారు. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అరాచకాలు చాలా ఉన్నాయి. సొంత పార్టీ ఎంపీని పోలీసులతో కొట్టించారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును (Chandrababu Naidu) అక్రమంగా జైల్లో పెట్టారు. మనందరిని రోడ్డుపైకి రాకుండా భయబ్రాంతులకు గురిచేశారు.

ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో అసెంబ్లీలో మొన్న జగన్ కు చూపించామని పవన్ అన్నారు. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ చేశారు. గత ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు భయపడేవారు. వైసీపీ నేతలు మనకు శత్రవులు కాదు. ప్రత్యర్థులు మాత్రమే. చట్టం తనపని తాను చేసుకుపోతుందని డిప్యూటీ సీఎం అన్నారు.

వారసత్వ రాజకీయాలకు నేను వ్యతిరేకం కాదు. అలాఅని ఇంట్లో కుటుంబ సభ్యులను ప్రజలపై రుద్దకండి. అధికారం అడ్డుపెట్టుకుని రౌడీయిజం ఎవరైనా చేస్తే వాళ్ళని వదులుకోవడానికి అయినా నేను సిద్ధమే. మీ పిల్లలు రాజకీయాల్లోకి రావాలి.. సక్రమమైన మార్గంలో రావాలి. సోషల్ మీడియాలో మహిళలపై ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటా. నేను లేకపోతే రాజకీయాలు లేవు అనేలా మాట్లాడకండి. కాలం చాలా బలమైంది. ఎప్పుడు ఎలా అయినా మారుతుంది.

151 సీట్లు వచ్చినవాళ్ళు 11 సీట్లకు పరిమితం అయ్యారు. అది గుర్తు పెట్టుకోవాలంటూ జనసేన శ్రేణులకు పవన్ సూచించారు. పార్టీలో క్రమశిక్షణారహితంగా ఎవరూ ఉండకూడదు. జనం కోసం, రాష్ట్రం కోసం నేను కుటుంబాన్ని పక్కన పెట్టి వచ్చాను. సొంత బిడ్డలా డబ్బులను పార్టీకి ఖర్చు పెట్టానని పవన్ తెలిపారు. ఇది మూడు పార్టీల సమిష్టి విజయం. మన వల్లే విజయం అనేలా ఎక్కడా మాట్లాడకండి అంటూ జనసేన శ్రేణులకు పవన్ సూచించారు.

నేను ఎలాంటి పదవులు ఆశించి పని చెయ్యలేదు. ఈరోజు ఉపముఖ్యమంత్రి పదవి వచ్చింది. ఇది చాలా పెద్ద బాధ్యత. ప్రజాపోరాటాలే తప్ప అధికార బాధ్యత ఎలా ఉంటుందో నాకు తెలియదు. జనసేనకు బాధ్యత గల శాఖలు తీసుకున్నా. ప్రజలకు నేరుగా అవసరం అయిన శాఖలు. భవిష్యత్తులో ఈ శాఖల విధివిధానాలు చాలా బలంగా ఉంటాయని పవన్ అన్నారు.

Also read: మిథున్ రెడ్డి, పొంగులేటితో పాటు.. ఏపీలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలను సమర్పించిన ప్రముఖులు వీరే!

#pawan-kalyan #ycp #tdp #janasena #mangalagiri
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe