Pawan Kalyan: తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలి.. కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.! రాజ్యాంగం ఎంత గొప్పదైనా దానిని అమలు పరిచేవారు సరిగా లేకపోతే ఆ వ్యవస్థ పనిచేయదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. చంద్రబాబు విజన్‌ను ముందుకు తీసుకెళ్తామని కలెక్టర్ల సమావేశంలో జనసేనాని తెలిపారు. స్కిల్ సెన్సెస్‌కు అధికారుల సలహాలు, సూచనలు ఎంతో అవసరమన్నారు. By Jyoshna Sappogula 05 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఎన్నో అవమానాలు భరించామన్నారు. వ్యక్తిగతంగా, కుటుంభ సభ్యులను సైతం జగన్ ప్రభుత్వం అవమానించిందని.. వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డామన్నారు. ఎన్నికల్లో కూటమిని ప్రజలు ఆశీర్వదించి, అధికారం ఇచ్చారన్నారు. Also Read: నంద్యాలలో వైసీపీ నేత హత్యపై జగన్ సీరియస్.. పార్టీ నేతల్ని ఇలా చేయమని చెబుతూ.. అయితే, ఉమ్మడి ఏపీలో కూడా ఇటువంటి ఇబ్బందులు పడలేదన్నారు. గతంలో ఏపీలో పనిచేయాలంటే IAS, IPS లు పోటీ పడేవారని..కానీ, గత ఐదేళ్లలో ఏపీలో పనిచేయాలంటే కొంతమంది భయపడి పోయారన్నారు. గత జగన్ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామన్నారు. మంచినీరు అన్ని గ్రామాలకు అందించడమే తమ లక్ష్యమన్నారు. Also Read: RTV ట్వీట్ కు స్పందించిన ఇండియన్ రైల్వే.. నిన్న విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంపై వివరణ! ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవజ్ఞుడని ఆయన నుంచి తన లాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నారు. జగన్ ప్రభుత్వం పాలనను ఛిద్రం చేసిందని, IAS, IPS లను పని చేయకుండా అడ్డుకున్నారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడడానికి తాము సిద్ధంగా ఉన్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కోసం తాము కష్టపడుతామని పేర్కొన్నారు. తమ నుండి తప్పులు ఉంటే అధికారులు తెలియజేయాలని.. తాము సరిదిద్దుకుంటామని పవన్ అన్నారు. స్కిల్ సెన్స్ కోసం అధికారుల సలహాలు,సూచనలు ఎంతో అవసరమని, వికసిత ఆంద్రప్రదేశ్ కోసం అధికారుల సూచనలు చాలా ముఖ్యం అని అన్నారు. #pawan-kalyan #ap-news #chandrababu-naidu #tdp #janasena మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి