Bhatti Vikramarka: మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ తలదించుకునే అంశం.. ఆదివాసీ మహిళ అత్యాచారంపై భట్టి!

అత్యాచారానికి గురైన ఆదివాసీ మహిళను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరామర్శించారు. నిమ్స్ హాస్పిటల్‌లో ఆమె కుంటుంబాన్ని ఓదార్చిన భట్టి.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించి, ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

New Update
Bhatti Vikramarka: మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ తలదించుకునే అంశం.. ఆదివాసీ మహిళ అత్యాచారంపై భట్టి!

TG News: చెంచు ఆదివాసీ మహిళపై (Tribal Woman) జరిగిన అత్యాచారం ఘటన అమానవీయమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) అన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూలు జిల్లా (Nagarkurnool) కొల్లాపూర్ మండలం మొల చింతలపల్లికి చెందిన బాధితురాలిని, ఆమె కుంటుంబాన్ని సోమవారం మంత్రి జూపల్లితో కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితులను ఇప్పటికే రిమాండ్ చేశారని చెప్పారు. పూర్తి సమాచారం సేకరించి కఠిన చర్యలు తీసుకుంటామని, ఆదివాసీ మహిళను, ఆమె కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించి, ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

యావత్ సమాజం తీవ్రంగా ఖండించాలి..
మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు తలదించుకునే ఘటన ఇది అని పేర్కొన్నారు. యావత్ సమాజం తీవ్రంగా ఖండించాల్సిన అంశం ఇది అన్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు గారు బాధితురాలను నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారని, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి సైతం తరలించారని వివరించారు. ఘటన విషయాన్ని మంత్రి జూపల్లి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారని తెలిపారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు బాధితురాలు పూర్తిగా కోలుకునే వరకు ఉచితంగా ప్రభుత్వం వైద్య సహాయం అందిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇల్లు లేని పక్షంలో ఇందిరమ్మ ఇల్లు, ఇద్దరు పిల్లలను ఆశ్రమ పాఠశాలలో వారు ఎంతవరకు చదువుకుంటాం అంటే అంతవరకు చదివిస్తాం, సాగుకు వ్యవసాయ భూమి కేటాయించడం వంటి అన్ని చర్యలు ప్రభుత్వపరంగా చేపడతామన్నారు.

వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి..
ఈ ఘటనలో సమీప బంధువులైన బావ, అక్కతో బాటు బయట ఒకరు ఇద్దరు ఉన్నట్టు సమాచారం ఉందని తెలిపారు. నిందితులను ఇప్పటికే రిమాండ్ కు తరలించారని, ఈ ఘటనలో పూర్తి సమాచారం సేకరించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించినట్టు చెప్పారు. మీడియా సమావేశానికి ముందు ఆసుపత్రిలో బాధితురాలిలితో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అందుతున్న వైద్య సహాయం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని, పూర్తి ఆరోగ్యంగా కోలుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాలని వైద్య అధికారులను కోరారు.

Also Read: రూ.33 కోట్లు గెలుచుకున్నాడు.. ఆనందం తట్టుకోలేక గుండెపోటుతో మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు