Deputy CM Bhatti vikramarka: భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి

బీఆర్‌ఎస్‌ హయాంలో ఇరిగేషన్‌, పవర్‌ ప్రాజెక్టులపై కాంగ్రెస్ గవర్నమెంట్ దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి అధ్యయనం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మణుగూరు చేరుకున్నారు. అక్కడ థర్మల్ ప్లాంట్ ను పరిశీలించనున్నారు.

New Update
Deputy CM Bhatti vikramarka: భద్రాద్రి పవర్ ప్లాంట్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం భట్టి

Bhadradri power plant:ఇరిగేషన్, పవర్ ప్రాజెక్టుల మీద ఫుల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంటు. బీఆర్ఎస్ హయాంలో ఈ రెండిటి మీద జరిగిన ప్రాజెక్టులను అధ్యయనం చేయాలని డిసైడ్ అయింది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్‌ను పరిశీలించిన మంత్రుల బృందం...ఇప్పుడు కరెంట్‌ కుంభకోణాలపై ఫోకస్‌ పెట్టింది. పవర్‌ ప్రాజెక్టులు, ఒప్పందాలు, విద్యుత్ ఉత్పాదకత, కొనుగోళ్లు, విక్రయాలపై సమీక్షలు నిర్వహించనుంది. దీనికి సంబంధించి పరిశీలన కోసం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మణుగూరు చేరుకున్నారు. మణుగూరులో నిర్మించిన తెలంగాణ తొలి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను భట్టి పరిశీలన చేయనున్నారు. ప్రాజెక్ట్‌ సామర్థ్యం, పనితీరు, విద్యుత్‌ ఉత్పాదకతపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ నిర్వహించనున్నారు.

Also read:ప్రజాపాలన దరఖాస్తు అమ్మకాల మీద సీఎం రేవంత్ సీరియస్

మరోవైపు చిక్కుడుగుంట పవర్ ప్లాంట్ మీద కూడా దృష్టి పెట్టింది కాంగ్రెస్. చిక్కుడుగుంట దగ్గర రూ.10వేల కోట్లతో 1130ఎకరాల విస్తీర్ణంలో ప్లాంట్‌ నిర్మాణం జరిగింది. అయితే ఈ నిర్మాణం అంచనా వ్యయాన్ని భారీగా పెంచినట్టు గత ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్లాంట్‌ నిర్మాణం కోసం TS జెన్‌కో, BHELమధ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. 1080 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదకత సామర్థ్యంతో 4 యూనిట్లు ఏర్పాటు చేశాయి. కానీ వీటిల్లో అధునాతన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించకుండా..సబ్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో ప్లాంట్‌ రన్‌ చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు