Telangana: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

డ్వాక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను అమలు చేశామని అన్నారు.

Telangana: మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్
New Update

Deputy CM Bhatti Vikramarka: తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీ పథకాలను (Congress Guarantees) అమలు చేశామని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ఇప్పటికే తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన రెండో రోజే మహాలక్ష్మి పథకం (Mahalaxmi Scheme) కింద ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని (Free Bus Scheme) మహిళలు సద్వినియిగం చేసుకుంటున్నారని. ప్రభుత్వం తెచ్చిన ఈ పథకానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని అన్నారు.

ALSO READ: ఇద్దరు ఎంపీలను ప్రకటించిన కేసీఆర్

ఉద్యోగాలను భర్తీ చేస్తాం..

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరి చేస్తున్నాం అని అన్నారు భట్టి. గత ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు పాడేవి కావని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంలో పేపర్ లీకేజీల వల్ల నిరుద్యోగులకు ఎంతో నష్టం చేకూరిందని.. TSPSC బోర్డును తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రక్షాళన చేశామని అన్నారు.

UPSC తరహాలో ప్రతి ఏడాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. మూడు నెలల్లో 25 వేల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామని అన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం కోచింగ్ సెంటర్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.

17 స్థానాల్లో కాంగ్రెస్ విజయం..

రానున్న లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అభ్యర్థుల ఎంపిక పై కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు చేస్తోందని అన్నారు. త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.

#bhatti-vikramarka #mahalaxmi-scheme #congress-guarantees
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe