తెలంగాణలో బొగ్గు గనుల్లో గతంలో జరిగిన వేలంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. ' గోదావరి బేసిన్‌లోని బొగ్గు గనులు .. కోయగూడెం, సత్తుపల్లి బొగ్గు గనులకు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించాయి. ఈ రెండు పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా లబ్ది చేకూరింది. 2021 కోల్ బ్లాక్‌ల వేలంలో సింగరేణి కంపెనీ పాల్గొనేందుకు ఆసక్తి చూపించినా కూడా మాజీ సీఎం కేసీఆర్ వద్దని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు.
Also read: తెలంగాణలో పారుతున్న నెత్తురు.. ఒకే రోజు ఐదు హత్యలు.. ఇంకెన్నో దారుణాలు!
అరబిందో గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆరో కోల్ కంపెనీ, శ్రీ అవంతికా కాంట్రాక్టర్స్, ప్రతిమా గ్రూప్‌లకు కోల్ బ్లాక్‌లు అప్పగించేందుకే.. బీఆర్ఎస్ సింగరేణిని వేలంలో పాల్గొనకుండా చేసింది. ఇప్పుడు కోయగూడెంకు 3, సత్తుపల్లికి 3 కోల్ బ్లాక్‌లను తిరిగి సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోందని' భట్టి అన్నారు. కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని వ్యాఖ్యానించారు.