BIG NEWS : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నట్లు అసెంబ్లీలో భట్టి విక్రమార్క తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే.. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు.

BIG NEWS : రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్
New Update

Bhatti Vikramarka : తెలంగాణ రైతులకు(Telangana Formers) రేవంత్ సర్కార్(Revanth Sarkar) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు అసెంబ్లీలో ఓటాన్ బడ్జెట్(Vote On Budget) ను ప్రవేశ పెట్టారు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka). ఈ బడ్జెట్ లో తమ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి పెద్ద పీట వేస్తోందని అన్నారు. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో పెట్టిన డబ్బులకు.. ఖర్చు పెడుతున్న డబ్బుకు పొంతన లేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు, తప్పులకు తమ ప్రభుత్వం బడ్జెట్ లో ఎలాంటి కోత విధించలేదని.. తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు.

త్వరలో రూ. 2 లక్షల రుణమాఫీ...

తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీపై(Runa Mafi) చేస్తామని అన్నారు. దీనికి కార్యాచరణ చేపడుతుమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం ద్వారా అనర్హులే ఎక్కువగా లాభం పొందారని మండిపడ్డారు.

గత ప్రభుత్వం కొండలు, గుట్టలు, రోడ్లకు కూడా రైతు బంధు నిధులు ఇచ్చిందని విమర్శించారు. పెట్టుబడిదారులు, రియల్‌ ఎస్టేట్‌(Real Estate) సంస్థలకు కూడా రైతు బంధు ఇచ్చారని ధ్వజమెత్తారు. అనర్హులకు రైతు బంధు ఇవ్వడం అక్రమం అని అన్నారు. రైతుబంధు(Rythu Bandhu) నిబంధనలను పునఃసమీక్ష చేస్తామన్నారు. తమ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు నూతన మార్గదర్శకాలు చేస్తున్నట్లు అసెంబ్లీలో భట్టి వివరించారు. రైతుల సంక్షేమం కోసం త్వరలో నూతన విత్తన విధానం తీసుకోస్తున్నట్లు తెలిపారు. ఇకపై తమ ప్రభుత్వం ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తాం అని హామీ ఇచ్చారు భట్టి విక్రమార్క.

Also Read : Amit Shah: ఏపీ పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

#bhatti-vikramarka #cm-revanth-reddy #rythu-barosa #rythu-runamfi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe