TSREDCO : రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలి : భట్టి

రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు అవసరమైనని ఛార్జింగి స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీఎస్‌ రెడ్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే భవిష్యత్తులో కరెంటు కొరత రాకుండా ఉండేందుకు సౌరవిద్యుత్తును ఎక్కువగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

New Update
Runa Mafi: రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన రేవంత్ సర్కార్

Telangana : రోజు రోజుకు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య పెరిగిపోతోంది. భవిష్యత్తులో రోడ్లపై ఎక్కువగా ఈ ఎలక్ట్రిక్‌ వాహనాలే కనిపిస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌(Electric Vehicles) కు అవసరమైనని ఛార్జింగి స్టేషన్లు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు వీటి ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క టీఎస్‌ రెడ్కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సౌరవిద్యుత్‌ తీసుకురావాలి

రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(TSREDCO) ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలపై ఆయన సమీక్ష జరిపారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల వల్ల కాలుష్యం పెరుగుతున్నందున వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇంధన పొదుపులో భాగంగా మార్కెట్లోకి వస్తున్న విద్యత్ వాహనాలకు ఛార్జింగ్ సదుపాయాలు కల్పించాలంటూ ఆదేశించారు. అలాగే భవిష్యత్తులో కరెంటు కొరత రాకుండా ఉండేందుకు సౌరవిద్యుత్తును ఎక్కువగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు.

ప్రభుత్వ ఆఫీసులపై సౌరవిద్యుత్‌ ఉండాలి

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అన్ని జలశయాలపై సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అంతేకాదు అన్ని ప్రభుత్వ ఆఫీసుల భవనాలపై రూఫ్‌టాప్ సౌరవిద్యుత్తు ఏర్పాటుకి ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే సౌర, పవన విద్యుత్ హైడ్రోజన్, పంప్డ్ స్టోరేజ్‌ లాంటి టెక్నాలజీ పాలసీలపై తీసుకోవాల్సిన చర్యలపై భట్టి అధికారులతో చర్చలు జరిపారు.

అవగాహన కల్పించాలి

ఇక మున్సిపల్ ప్రాంతాల్లో సేకరించిన చెత్త చెదారం నుంచి కంప్రెస్ట్ బయోగ్యాస్, విద్యుదుత్పత్తికి సంబంధించి భవిష్యత్తు కార్యచరణ ప్రణాళికల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్, నిజామాబాద్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లలో బయోగ్యాస్ ప్లాంట్‌ల ఏర్పాటు గురించి అలాగే మున్సిపల్ శాఖకి పంపించిన ప్రతిపాదనల గురించి మంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) కు రెడ్కో ఎండీ జానయ్య వివరించారు. అయితే గృహ వినియోగదారులకు రూఫ్‌టాప్ సౌరవిద్యుత్‌పై ప్రభుత్వం అందించే రాయితీలపై అవగాహన కల్పించాలని భట్టి ఆదేశించారు.

Advertisment
తాజా కథనాలు