Depression in Women: మహిళల మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఓ నివేదిక కీలక విషయాలను బయటపెట్టింది. ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళల్లో రోజురోజుకు డిప్రెషన్ పెరిగిపోతుంది. డిప్రెషన్‌లో ఉన్న మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. JACC ఆసియాలో ప్రచురించబడిన ఓ నివేదికలో స్త్రీలు, పురుషులలో కార్డియోవాస్కులర్‌ని పరీక్షించారు. డిప్రెషన్‌తో బాధపడుతున్న పురుషుల్లో గుండె జబ్బులు (Heart Disease) వచ్చే ప్రమాదం 1.39 శాతం, మహిళల్లో 1.64 శాతం ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఆంజినా పెక్టోరిస్, ఏట్రియాల్ ఫిబ్రిలేషన్ ప్రమాదం కూడా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు అంటున్నారు.
మహిళల్లోనే డిప్రెషన్ ఎందుకు ఎక్కువ..?
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్త్రీ జీవితంలో చాలా మార్పులు సంభవిస్తాయి. ప్రెగ్నెన్సీ (Pregnancy) నుంచి మెనోపాజ్ వరకు అన్నింటిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనేక హార్మోన్ల మార్పులు కూడా జరుగుతాయి. అందుకే ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతారని అంటున్నారు. ఎందుకంటే సైటోకైన్స్ (Cytokines) వంటి ప్రమాదకరమైన హార్మోన్లు గుండెపై నేరుగా ప్రభావం చూపుతాయి. మహిళలు తల్లులుగా మారినప్పుడు, కొంతమంది పిల్లలను చూసుకునేటప్పుడు ఇకపై ఏమీ చేయలేరని వాళ్లు నమ్ముతారని నిపుణులు అంటున్నారు. దీనిని ప్రసవానంతర డిప్రెషన్ అని కూడా అంటారు. ఈ కారణంగా మహిళలు నిరాశకు గురవుతారని, ఒత్తిడి, చిరాకు, కోపంగా ఉంటారని, దాదాపు 50-60 శాతం మహిళల్లో ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు డిప్రెషన్‌లోకి వెళ్లడానికి పురుషుల ఆధిపత్య సమాజమే ఒక కారణమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మానసిక ఆరోగ్యం:
ఒక నివేదిక ప్రకారం.. భారతదేశంలో మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో ఒక శాతం కంటే తక్కువ మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రపంచం మొత్తం తమ జీడీపీలో 5-18 శాతం మానసిక ఆరోగ్యంపై వెచ్చిస్తోంది. సేజ్ జర్నల్ 2023 నివేదిక ప్రకారం మానసిక ఆరోగ్య చికిత్స కోసం 20 శాతం భారతీయ కుటుంబాలు పేదలుగా మారుతున్నాయి. కాబట్టి ఆరోగ్య నిపుణులు దీనిపై మరింత చొరవ తీసుకోవాలని అంటున్నారు.
ఇది కూడా చదవండి: బ్రేక్‌ఫాస్ట్‌లో ఐదు పదార్థాలు తింటే డేంజర్..ఈ వ్యాధులు తప్పవు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.