/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-25.jpg)
Democratic Running Mate:అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్‌వాల్ట్స్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. స్వయంగా కమలా హారిస్ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేశారని చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా డెమోక్రటిక్ పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
టిమ్ వాల్ట్స్‌కు అమెరికా రాజకీయాల్లో 12 ఏళ్ళ అనుభవం ఉంది. 12 ఏళ్ళపాటూ అమెరికా చట్టసభల్లో టిమ్ సేవలందించారు. 2018లో మిన్నెసోటా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. రిపబ్లిక్ పార్టీని తన మాటలతో ఎండగట్టడంలో టిమ్ వాల్ట్స్ ది అందె వేసిన చెయ్యి. రాజకీయాల్లోకి రాకముందు అమెరికా ఆర్మీ నేషనల్ గార్డ్‌లో 20ఏళ్ళ పాటూ పనిచేశారు.