స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే... ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు...!

author-image
By G Ramu
స్వాతంత్య్ర దినోత్సవం రోజు కూడా విపక్షాలపై మండిపడితే... ఇక దేశాన్ని మోడీ ఎలా నిర్మిస్తారు...!
New Update

దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సాంప్రదాయాలన్నింటికీ ముప్పు పొంచి వుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ మాట చెప్పడానికి తాను చాలా బాధపడుతున్నానని చెప్పారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

పార్లమెంట్ లో ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ద్వారా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పార్లమెంట్ లో తాను మాట్లాడుతుండగా తన మైక్ కట్ చేశారని వెల్లడించారు. ఓ వైపు ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెప్పుకుంటున్నామని, మరో వైపు పార్లమెంట్ లో మాట్లాడకుండా తమ నోటికి సీల్ వేస్తున్నారంటూ వాపోయారు.

2024లోనూ ఎర్రకోటపై తామే జెండా ఎగురవేస్తామన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాము మళ్లీ, మళ్లీ గెలుస్తామని గెలిచిన ప్రతి ఒక్కరూ చెబుతుంటారని అన్నారు. మిమ్మల్ని గెలిపించడం లేదా ఓడించడం ప్రజల చేతుల్లో వుంటుందన్నారు. 2024లో మరోసారి జెండా ఎగురవేస్తానని మోడీ ఇప్పుడే చెప్పడం ప్రధాని అహంకారానికి నిదర్శనమన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ ఉంటే దేశాన్ని ప్రధాని ఎలా నిర్మిస్తారు ? అని ప్రశ్నించారు. మొదట వాళ్లు ‘అచ్చే దిన్’గురించి మాట్లాడారన్నారు. ఆ తర్వాత వాళ్లు ‘న్యూ ఇండియా’గురించి మాట్లాడారని, ఇప్పుడు అమృత్ కాల్ అంటున్నారని చెప్పారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఇలా పేర్లు మారుస్తున్నారని ఫైర్ అయ్యారు.

#opposition #mallikarjun-kharge #constitution #democracy #pm-modi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe