ఆ పని చేయాలంటే నిమిషానికి 10 లక్షలు ఇవ్వాల్సిందే!

తనకున్న స్టార్‌ ఇమేజ్‌ ని క్యాష్‌ చేసుకోవాలనుకుంటుంది సీతారామం భామ మృణాల్‌ ఠాకూర్‌. ఏదైనా షాపింగ్‌ మాల్ ఓపెనింగ్‌ కి వెళ్తే అక్కడ ఎంతసేపు ఉంటే..అన్ని నిమిషాలకు..నిమిషానికి లక్ష చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుందని ఓ వార్త నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది.

New Update
ఆ పని చేయాలంటే నిమిషానికి 10 లక్షలు ఇవ్వాల్సిందే!

సీతారామం (Seetharamam)  సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సీతామహాలక్ష్మిల దగ్గరైన మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ...హాయ్‌ నాన్న  (Hai nanna) అంటూ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ స్టార్‌ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సినిమాలను ఎంచుకోవడం లో ఈ భామ ఆచితూచి వ్యవహరిస్తుందనే చెప్పవచ్చు.

రెమ్యునరేషన్‌ పరంగా తనకు వచ్చిన అవకాశాలను చేసేయకుండా..అసలు కథేంటి? కథలో ఉన్న విషయం ప్రేక్షకులకు చేరుతుందా అనే విషయాలను లోతుగా ఆలోచించి అడుగులు వేస్తుంది ఈ భామ. ఇలా క్రేజ్‌ ఉన్న ముద్దుగుమ్మలను పెద్ద పెద్ద సంస్థలు తమ వ్యాపార సంస్థల ఓపెనింగ్స్‌ కి పిలవడం సాధారణంగా జరిగే విషయమే.

ఇలా చాలా మంది హీరోయిన్లు ఓపెనింగ్‌ కి వెళ్తే లక్షల్లో రెమ్యూనరేషన్‌ తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ బాటలోకి మృణాలు కూడా చేరింది. ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవానికి రావాలంటే..అక్కడ ఎన్ని నిమిషాలు ఉన్నప్పటికీ నిమిషానికి రూ.10 లక్షలు డిమాండ్‌ చేస్తుందంట. అంటే గంట సేపు ఉంటే ఆమెకి అక్షరాల ఆరు కోట్లు ఇచ్చుకోవాల్సిందే అనమాట.

దీంతో షాపింగ్‌ మాల్‌ నిర్వాహకులు భయపడి ఆమెను పిలవడానికే జంకుతున్నారంట. దీనికి సంబంధించిన వార్త ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానిని చూసిన నెటిజన్స్‌ '' ఎంత ఫేమ్‌ ఉంటే మాత్రం అంత డిమాండ్‌ చేయకూడదంటూ'' కామెంట్లు పెడుతున్నారు.

Also read: మీరు ఆరోగ్యంగా ఉన్నారా..అయితే బోనస్‌ ఇస్తాం..శాలరీ కూడా పెంచుతాం!

Advertisment
Advertisment
తాజా కథనాలు