Arvind Kejriwal : కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపులు.. నిందితుడి అరెస్టు ఇటీవల ఢిల్లీలోని మెట్రో స్టేషన్ గోడలపై కేజ్రీవాల్‌ను చంపుతామంటూ బెదిరింపు రాతలు రాసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని అంకిత్ గోయల్(33) గా గుర్తించారు. అతనికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. By B Aravind 22 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Threatening Graffiti Against Arvind Kejriwal : లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో ఇటీవల మధ్యంతర బెయిల్ (Interim Bail) తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. అయిన వచ్చిరాగానే.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే కేజ్రీవాల్‌ను చంపుతామంటూ ఓ దుండగుడు మెట్రో స్టేషన్ గోడలపై బెదిరింపు రాతలు రాశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని అంకిత్ గోయల్ (33)గా గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిని విచారిస్తున్నారు. అయితే కేజ్రీవాల్‌ను చంపుతామంటూ అంకిత్ మెట్రో గోడలపై బెదిరింపు రాయడం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. Also read: మేము అధికారంలోకి వస్తే ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ మే 19న పటేల్‌నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో అంకిత్ గోయల్ కేజ్రీవాల్ గురించి బెదిరింపు సందేశాన్ని రాశాడు. సీసీటీవీలో పరిశీలించిన అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అంకిత్ బరేలి అనే ప్రాంతానికి చెందినవాడు. ప్రస్తుతం అతడు బ్యాంకులో పనిచేస్తున్నారు. అతనికి ఏ రాజకీయ పార్టీతో కూడా సంబంధం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు అతని వెనుక బీజేపీ ఉందటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఆరోపణలు చేస్తోంది. Also Read: గగనంలో దేశభక్తిని చాటిన గోపిచంద్! #telugu-news #arvind-kejriwal #delhi-police మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి