Delhi Heavy Rains : ఢిల్లీలో కుండపోత.. ఏడుగురి మృతి!
బుధవారం సాయంత్రం ఢిల్లీ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాలు నీటితో పూర్తిగా నిండిపోయాయి. ట్రాఫిక్ ఎక్కడిది అక్కడే నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షాల వల్ల ఇప్పటి వరకు ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.